Begin typing your search above and press return to search.

నెట్ లో చిక్కిన చేప పిల్ల టూ హాట్

By:  Tupaki Desk   |   14 Dec 2021 3:30 AM GMT
నెట్ లో చిక్కిన చేప పిల్ల టూ హాట్
X
నెట్టెడ్ డిజైన‌ర్ లుక్.. సంథింగ్ హాట్.. సంథింగ్ స్పెష‌ల్. ఇలాంటివి ఇంత‌కుముందు హాలీవుడ్ లోనే క‌నిపించేవి. పాశ్చాత్య దేశాల్లో శృంగార సామ్రాజ్యంలో విరివిగా ఇలాంటి లుక్ తో భామ‌లు టెంప్ట్ చేయ‌డం బ‌య‌ట‌ప‌డేది. కానీ ఇప్పుడు నేరుగా టాప్ హీరోయిన్లు నెట్టెడ్ దుస్తుల‌తో గుండెల్లో గుబులు రేపుతున్నారు.

ఇదిగో ఇక్క‌డ లైగ‌ర్ బ్యూటీ అన‌న్య పాండే నెట్టెడ్ డిజైన‌ర్ డ్రెస్ లో త‌ళుక్కుమంది. త‌న పొడుగు కాళ్ల సౌంద‌ర్యాన్ని ఆ నెట్టెడ్ బాట‌మ్ ఎంతో గొప్ప‌గా ఆవిష్క‌రించింద‌నే చెప్పాలి. నెట్టెడ్ స్వెట్ట‌ర్ .. లాంగ్ బూట్స్ త‌న అందాన్ని మ‌రింత‌గా పెంచాయి. విక్టోరియా రేంజులో త‌న హెయిర్ స్టైల్ ని కూడా మార్చేసింది అన‌న్య‌. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ యువ‌త‌రంలో వైర‌ల్ గా మారాయి. నెట్ లో చిక్కిన చేప పిల్ల టూ హాట్ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

అన‌న్య న‌టించిన లైగ‌ర్ విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమాతో తెలుగులో అన‌న్య గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తోంది. సౌత్ అంత‌టా పాన్ ఇండియా నాయిక‌గా ప‌రిచ‌యం కాబోతుండ‌డం త‌న‌ని ఎగ్జ‌యిట్ చేస్తోంద‌నే చెప్పాలి. ఇటీవ‌లే లైగ‌ర్ లాస్ ఏంజెల్స్ షెడ్యూల్ ని ముగించిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలోనే మంచి పెర్పార్మ‌ర్ గా నిరూపించుకుంది. వ‌రుస చిత్రాల‌తో అక్క‌డ‌ ప్రామిసింగ్ న‌టిగా వెలిగిపోతుంది. అమ్మ‌డిలో ఆ ట్యాలెంట్ చూసే పూరి అవ‌కాశం క‌ల్పించారు.