Begin typing your search above and press return to search.

పీచుమిఠాయ్ డ్రెస్ లో లైగ‌ర్ బ్యూటీ

By:  Tupaki Desk   |   28 Dec 2021 5:30 PM GMT
పీచుమిఠాయ్ డ్రెస్ లో లైగ‌ర్ బ్యూటీ
X
బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` చిత్రంతో బాలీవుడ్ లో లాంచ్ అయిన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమాతోనే స‌క్సెస్ అందుకోవ‌డమే గాక అవార్డులు..రివార్డులు ద‌క్కించుకుంది. అటుపై మ‌రో మూడు చిత్రాల్లో న‌టించింది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో `లైగ‌ర్` చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న చిత్రంపై భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా స‌క్సెస్ అయితే గ‌నుక టాలీవుడ్ లో మంచి కెరీర్ ఉంటుంది.

బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంలోనే మంచి పెర్పార్మ‌ర్ గా నిరూపించుకుంది. ప్రామిసింగ్ న‌టిగా వెలిగిపోతోంది. అమ్మ‌డిలో ఆ ట్యాలెంట్ చూసే పూరి అవ‌కాశం క‌ల్పించారు. మ‌రి అన‌న్య ల‌క్ ఎలా ఉంది? అన్న‌ది కాల‌మే నిర్ణ‌యించాలి. ఇక ఈ బ్యూటీ సోష‌ల్ మీడియా సంచ‌ల‌నాల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఇన్ స్టాలో ప్ర‌తీ రోజు కొత్త ఫోటోషూట్ల‌తో హీట్ పెంచుతోంది ఈ బ్యూటీ.

తాజాగా ఈ బ్యూటీ వైట్ అండ్ వైట్ లుక్ ఫ్యాష‌న్ ప్రియుల్ని ఆక‌ట్టుకుంటోంది. టాప్ టూ బాట‌మ్ డిజైన‌ర్ వైట్ డ్రెస్ ధ‌రించి చూప‌రుల్లో హాట్ టాపిక్ అవుతుంది. పాదాల వ‌ర‌కూ మెస్ లుక్.. తెల్ల‌టి సాక్సుల‌తో క‌వ‌రప్ చేసింది. మోకాళ్ల‌పై అలా కుర్చుని కెమెరాకి ఫోజులిచ్చింది. ఈ యాంగిల్ కి అన‌న్య ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. `యానీ ఇన్ వండ‌ర‌ల్ ల్యాండ్` అంటూ ఓ కుందేలు ఎమోజీని పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు చేస్తూ మ‌రింత మురిపిస్తున్నారు. కొంద‌రైతే పీచుమిఠాయ్ డ్రెస్ లో లైగ‌ర్ బ్యూటీ ఏంటిలా? అంటూ కామెంట్ చేస్తున్నారు.