Begin typing your search above and press return to search.

గులాబీ వ‌ర్ణంలో గుబులు పుట్టిస్తోందిగా!

By:  Tupaki Desk   |   9 May 2023 5:00 AM
గులాబీ వ‌ర్ణంలో గుబులు పుట్టిస్తోందిగా!
X
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే టెంప్టింగ్ పోజుల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాష‌న్ ఎంపిక‌ల్లో త‌న‌దైన మార్క్ త‌ప్ప‌నిస‌రి. ఇన్ స్టా వేదికగా బ్యూటీ మంటలు రేపడం షరా మామూలే. డిజైనర్ దుస్తుల్లో త‌న‌దైన గ్లామ్ తో ఆకట్టుకుటుంది. ఆల్ట్రా మోడ్రన్ లుక్ లోనూ అనన్య మెరుపులు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంటాయి. స్టైలిష్ ఎంపిక‌ల్లోనూ అన‌న్య వావ్ అనిపిస్తుంది.

తాజాగా అన‌న్య పింక్ అందంలో మ‌రోసారి ప‌రిమ‌ళించింది. ఇదిగో ఇక్క‌డిలా గులాబీ వ‌ర్ణం దుస్తుల్లో కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. థై అందాల్ని సైతం గులాబీ రంగులో పులిమేసింది. పాల నురుగుల సౌంద‌ర్యంపై గులాబీ మెరుపులు మ‌రింత వ‌న్నె తీసుకొచ్చాయి.

కంప్లీట్ మ్యాక‌ప్ లో? టోన్డ్ బాడీ లుక్ లో అమ్మ‌డు త‌ళ‌త‌ళ‌లాడుతుంది. చేతిలో చెరుస్తోన్న చిన్న బ‌కెట్..ఎంపిక చేసుకున్న యాక్స‌ర‌సీస్ ప్ర‌తీతి అమ్మ‌డి అందాన్ని మ‌రింత ఫోక‌స్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంతార్జాలంలో వైర‌ల్ గా మారింది. అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.

ఇక బ్యూటీ కెరీర్ సంగతి చూస్తే బాలీవుడ్ లో బిజీ అయ్యే ప్ర‌య‌త్నాల్లో ఉంది. టాలీవుడ్ లో లైగ‌ర్ తో ఎంట్రీ ఇచ్చినా ఫ‌లితం తేడాగా రావ‌డంతో సీన్ అర్ధ‌మైంది. ఈ నేప‌థ్యంలో మ‌రో ఆలోచ‌న లేకుండా మాతృభాష‌లోనే మ‌న ట్యాలెంట్కి త‌గ్గ అవ‌కాశాలున్నాయని భావించి ఆ దిశ‌గా అడుగులు వేస్తుంది.

ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో రెండు..మూడు ప్రాజెక్ట్ లు రెడీగా ఉన్నాయి. 'కో గ‌యే హ‌మ్ ఖాన్' చిత్రం షూటింగ్ ఇప్ప‌టికే పూర్త‌యింది. ప్ర‌స్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రో సినిమా 'డ్రీమ్ గర్ల్ -2' షూటింగ్ ద‌శ‌లో ఉంది. ఈ రెండు సినిమాల‌పై అన‌న్య భారీ ఆశ‌లు పెట్టుకుంది. హిట్ అయితే మ‌రిన్ని ఛాన్సులు అందుకొవ‌చ్చ‌ని ఆశిస్తుంది. మ‌రి అమ్మ‌డి టైమ్ ఎలా న‌డుస్తుందో చూడాలి.