Begin typing your search above and press return to search.

'అందుకోసం గ్లామర్ ఎంతైనా ఒలికిస్తా' అంటున్న కుర్ర బ్యూటీ!

By:  Tupaki Desk   |   13 Jun 2020 2:30 AM GMT
అందుకోసం గ్లామర్ ఎంతైనా ఒలికిస్తా అంటున్న కుర్ర బ్యూటీ!
X
ప్రస్తుత కాలంలో కొందరు హీరోయిన్లు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇరవై నాలుగు గంటలు కష్టపడినా రెండు మూడేళ్ల కంటే ఎక్కువగా హీరోయిన్ గా నిలబడటం లేదు. దాంతో దొరికిన ఛాన్సులను కళ్లకు అద్దుకుని తీసుకుంటున్నారు. అందుకోసమే కష్టపడుతున్నారు.. ఇప్పుడు ఓ బాలీవుడ్ యంగ్ హీరోయిన్ కూడా అదే బాటలో నడుస్తుంది. గతేడాది 'స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన కుర్రభామ అనన్య పాండే. అందాల ఆరబోతకు తోడు మంచి అభినయం కూడా అనన్య సొంతం. ప్రముఖ బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తోంది. గ్లామర్ షోకు కూడా ఏ మాత్రం తీసిపోకుండా అన్నిటికి సిద్ధమే అంటుంది అనన్య.

సినిమా అంటే ప్రాణం కాబట్టి సినిమా కోసం ఎంత గ్లామర్ కావాలన్నా ఒలికిస్తా అంటుందట. ఇలాంటి వర్క్ డెడికేషన్ ఉన్న హీరోయిన్స్ ఈ రోజుల్లో చాలా తక్కువ మంది ఉంటారు అంటూ చిత్రయూనిట్‌తో పాటు దర్శక నిర్మాతలు కూడా అనన్యను నెత్తిన పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం అమ్మడు తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫైటర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. పూరీ జగన్నాథ్ దర్శకుడు. పాన్ ఇండియా మూవీతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. ఇక సోషల్ మీడియాలో అనన్యకి మిలియన్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అమ్మడి పోస్టుల కోసం ఫ్యాన్స్ ఎగబడి ఎదురు చూస్తుంటారు. అయితే తాజాగా అనన్య తన బెస్ట్ ఫ్రెండ్ శనయ కపూర్ తో అందమైన ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది. అందులో ఇద్దరి భామల అందాలను చూస్తూ కుర్రాళ్ళు మతులు పోగొట్టుకుంటున్నారు. శనయ కూడా త్వరలో తెరమీదకు రానున్నట్లు తెలుస్తుంది.