Begin typing your search above and press return to search.

అప్పుడే షిప్ట్ అయిపోయిన అన‌న్యా పాండే?

By:  Tupaki Desk   |   29 Aug 2022 6:30 AM GMT
అప్పుడే షిప్ట్ అయిపోయిన అన‌న్యా పాండే?
X
'లైగ‌ర్' సినిమా ప్ర‌చారానికి ముంబై బ్యూటీ అన‌న్య పాండే ఎంత‌గా స‌హ‌క‌రించిందో? చెప్పాల్సిన ప‌నిలేదు. విజ‌య్- పూరి-ఛార్మి ముగ్గురు దేశం మొత్తం తిప్పేసారు. ఆ ముగ్గురితో పాటు అన‌న్యపాండే ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. అమ్మ‌డికి టాలీవుడ్ కొత్త కానీ..బాలీవుడ్ కాదు. అయినా ఎక్క‌డా త‌ల బిరుసు చూపించుకుండా ఉత్త‌రాది రాష్ర్టాలు అన్నింటిని చుట్టేసింది.

ఇక తెలుగు రాష్ర్టాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌లు ప్రాంతాల్లోనూ తిరిగింది. ఈ క్ర‌మంలో ఎక్క‌డా విసుగు చెంద‌లేదు. ప్ర‌చారం విష‌యంలో టీమ్కి ఎంతో స‌హ‌క‌రించింది. కానీ 'లైగ‌ర్' ఫ‌లితం మాత్రం తీవ్ర నిరాశ‌నే మిగిల్చింది. తాము ఒక‌ట‌నుకుంటే? ఫ‌లితం మ‌రోలా వ‌చ్చింది. తొలి షో తోనే బాక్సాఫీస్ వ‌ద్ద 'లైగ‌ర్' స‌త్తా తేలిపోయింది. దీంతో థియేట‌ర్లు అన్నీ ఖాళీ అయిపోయాయి.

ప్ర‌స్తుతం పూరి-ఛార్మి-విజ‌య్ ఎవ‌రి ప‌నుల్లో వాళ్లు బిజీ అవుతున్నారు. మ‌రి అనన్య ఏం చేస్తున్న‌ట్లు? అంటే ఆ బ్యూటీ కూడా ముంబై షిప్ట్ అయిపోయింద‌ని తెలుస్తోంది.

తాజాగా అమ్మ‌డు స్నేహితుల‌తో ఇంట్లో క‌లిసి ఆడుకుంటోన్న ఓ వీడియోని పో స్ట్ చేసింది. అందులో పలువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఓ హిందీ పాట‌కి డాన్స్ చేస్తూ ఆక‌ట్టుకుంటున్నారు.

క్రికెట్ ఆడుతున్న‌ట్లు ఎక్స్ ప్రెష‌న్స్ ఇస్తోన్న స‌మ‌యంలో అన‌న్య కీపింగ్ చేస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. దీన్ని బ‌ట్టి అన‌న్య 'లైగ‌ర్' ప్లాప్ నుంచి త్వ‌ర‌గానే బ‌య‌ట ప‌డిన‌ట్ల తెలుస్తోంది. ఇక బాలీవుడ్ లో నూ పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. ప్ర‌స్తుతం 'కోహో గ‌యే హ‌మ్ క‌హానా చిత్రంలో న‌టిస్తుంది. ఇది మినిహా కొత్త చిత్రాలేవి క‌మిట్ అవ్వ‌లేదు.

తెలుగులో లైగ‌ర్ అనూహ్య‌మైన దెబ్బ కొట్టింది. ఈసినిమా హిట్ అయితే వెంట‌నే ఛాన్సులు రావడానికి అవ‌కాశం ఉండేది. కానీ ఇప్పుడా ఛాన్స్ లేదు. ప్లాప్ ఇమేజ్ అమ్మ‌డిపై గ‌ట్టిగానే ప‌డింది. పైగా పూరి ప్లాప్ హీరోయిన్లు ఇక్క‌డ స‌క్సెస్ అయింది త‌క్కువ‌. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ లో అవ‌కాశాలు అంత ఈజీ కాదు. స‌క్సెస్ ఉంటే త‌ప్ప ప్లాప్ ల‌తో అవ‌కాశాలు అంటే అంత సులభం కాదిక్క‌డ‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.