Begin typing your search above and press return to search.

#లైగ‌ర్ల్‌.. వ‌లలో చిక్కుకున్న చేప పిల్ల‌!

By:  Tupaki Desk   |   18 Dec 2021 3:29 AM GMT
#లైగ‌ర్ల్‌.. వ‌లలో చిక్కుకున్న చేప పిల్ల‌!
X
బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే నటుడు చుంకీ పాండే వార‌సురాలిగా రంగ ప్ర‌వేశం చేసిన సంగ‌తి తెలిసిందే. క‌ర‌ణ్ జోహార్ `స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్` చిత్రంతో బాలీవుడ్ లో లాంచ్ అయింది. తొలి సినిమాతోనే త‌న‌దైన అందం న‌ట‌నతో కుర్ర‌కారుకు గిలిగింత‌లు పెట్ట‌డంలో స‌ఫ‌ల‌మైంది. ఉత్త‌మ డెబ్యూగా అవార్డులు..రివార్డులు ద‌క్కించుకుంది. అటుపై వ‌రుస‌గా మ‌రో మూడు చిత్రాల్లో న‌టించింది. న‌టిగా ప‌రిణ‌తిని సంపాదించింది.

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో `లైగ‌ర్` చిత్రంతో ఎంట్రీ ఇస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ఈ సినిమా స‌క్సెస్ అయితే టాలీవుడ్ లో అన‌న్య‌కు మంచి కెరీర్ ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే ప‌లువురు అగ్ర హీరోల క‌న్ను అన‌న్య పై ప‌డింద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది.

బాలీవుడ్ లో కెరీర్ ఆరంభంమే డ్యాషింగ్ పెర్పార్మ‌ర్ గా నిరూపించుకుంది. న‌టిగా వ‌రుస అవ‌కాశాల‌తో వెలిగుతోంది. ఈ భామ‌లో ట్యాలెంట్ కి ఫిదా అయ్యి పూరి అవ‌కాశం క‌ల్పించారు. లైగ‌ర్ నుంచి అన‌న్య ల‌క్ ఎలా ఉంటుందో మునుముందు రివీల్ చేయ‌నున్నారు. ఇక ఈ బ్యూటీ సోష‌ల్ మీడియా సంచ‌ల‌నంగానూ అభిమానులకు సుప‌రిచితం. ఇన్ స్టాలో ప్ర‌తీ రోజు కొత్త ఫోటోల‌తో స్పైసీ ట్రీట్ ఇస్తుంటుంది. టీజింగ్ ఫోటోల్ని పోస్ట్ చేసి ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ ని ఆక‌ట్టుకుటుంది.

తాజాగా అన‌న్య వైట్ బికినీ లో ప్ర‌త్య‌క్ష‌మై ఫ్యాష‌న్ ప్రియుల్ని అల‌రించింది. మ‌త్తెక్కించే చూపుల‌తో మ‌తులు చెడ‌గొడుతుంది. బికినీపై నెట్ డిజైన్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. అన‌న్య బికినీలో ఎంత హాట్ గా ఉన్నా నెట్ లో చిక్కిన చేప‌పిల్ల‌లా ఉందంటూ ఒక‌టే కామెంట్లతో యూత్ విరుచుకుప‌డుతున్నారు.

ఇది వెస్ట్ర‌న్ స్టైల్ ఫోటోషూట్ .. వ‌ల‌లో చిక్కుకున్న మ‌త్స‌క‌న్య‌లా క‌నిపిస్తోంది అంటూ ఒక నెటిజ‌న్ కితాబిచ్చాడు. భుజాల ద‌గ్గ‌ర నుంచి కాళ్ల వ‌ర‌కూ నెట్ మొత్తం క‌వ‌రప్ చేసింది. నెట్ ని ఉద్ధేశించి అన‌న్య ఓ వ్యాఖ్యను జోడించింది. `నెట్ లో చిక్కుకున్న ఓ పండు లా క‌నిపిస్తున్నాను` అని క్యాప్ష‌న్ ఇచ్చింది. మ‌రి అన‌న్య నెట్ లో చిక్కుకున్న పండులా క‌నిపిస్తుందా? మ‌త్స్య క‌న్య‌లా క‌నిపిస్తుందా? అన్న‌ది నెటిజ‌నుల‌కే డిసైడ్ చేయాలేమో!