Begin typing your search above and press return to search.

కురచ దుస్తులపై కఠిన నిర్ణయం

By:  Tupaki Desk   |   26 Jun 2016 6:03 AM GMT
కురచ దుస్తులపై కఠిన నిర్ణయం
X
నేటి ట్రెండ్ కి తగ్గట్టుగా హీరోయిన్ గా రాణిస్తూ మంచి స్థానంలో నిలబడాలంటే నటనతో పాటూ గ్లామర్ కూడా అత్యవసరం. ఇంకా చెప్పాలంటే ప్రధాన స్థానం గ్లామర్ కె చెల్లుతుంది. అయితే గ్లామర్ విషయంలో తనకి పరిధి వుందని, కురచ దుస్తుల్లో మాత్రం కనిపించనని ఒక హీరోయిన్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇంతకీ ఎవరా హీరోయిన్?

జర్నీ - అ..ఆ సినిమాలలో ప్రధాన పాత్రలు పోషించి తన నటనతో ఆకట్టుకుంటున్న అమ్మాయి అనన్య.మలయాళ సినిమా రంగంనుండి టాలీవుడ్ కి వచ్చిన ఈ కేరళ కుట్టి ఎక్స్ పోజింగ్ కి మాత్రం నై అంటుంది. గ్లామర్ కేవలం శరీరాన్ని ఎక్స్ పోజ్ చేసినంత మాత్రాన్నే రాదని స్పష్టం చేసింది.

తొలినాళ్ళలోనే మోహన్ లాల్ - అమితాబ్ వంటి నటులతో పనిచేయడం తన అదృష్టమని తెలిపింది. నటనేకాకుండా తనకి పాటలు పాడడం కూడా బాగా వచ్చని స్పష్టం చేసింది. సినిమా రంగం కాకపోతే తనకిష్టమైన ఆర్చరీ రంగంలో ప్రావీణ్యం సాధిస్తానని ముగించింది.