Begin typing your search above and press return to search.

#ఫైట‌ర్ హీరోయిన్.. నోట్లో బొద్దింకను వేస్తోందిలా!

By:  Tupaki Desk   |   25 Jan 2021 3:30 AM GMT
#ఫైట‌ర్ హీరోయిన్.. నోట్లో బొద్దింకను వేస్తోందిలా!
X
బొద్దింక‌లు తేళ్లు జెర్రెలు తినే చైనీయులు క‌రోనా వైర‌స్ అనే అతి ప్ర‌మాద‌క‌ర వైర‌స్ ను సృష్టించి ప్ర‌పంచానికి అంటించిన సంగ‌తి తెలిసిన‌దే. దానిని వూహాన్ (చైనా) వైర‌స్ అంటూ అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ప‌దే ప‌దే చైనీయుల‌పై ఎటాక్ చేశారు. ఆ త‌ర్వాత అమెరికా.. భార‌త్ స‌హా ప్ర‌పంచ దేశాలు చైనాకు త‌లుపులు మూసేసాయి. ప్ర‌యాణ మార్గాల్ని నిలువ‌రించాయి.

అదంతా ఇప్పుడే ఎందుకు? అంటే.. ఇదిగో ఈ అమ్మ‌డు చేస్తున్న ప‌ని అలా ఉంది మ‌రి. అలా అల‌వోక‌గా బొద్దింక‌ను నాలుక‌పై వేసి క‌ర‌క‌ర‌లాడిస్తుంద‌ట‌.. ఎలాంటి భ‌యం లేకుండా? .. పైగా అంద‌రినీ టీజ్ చేస్తోంది.

``అస‌లు విష‌యం చెబుతాను .. ఈ రాత్రి 8 గంటలకు `ఖలీ పీలీ` ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ ను @ జీసినిమాలో చూడండి . ఈ షూట్ సమయంలో కీటకాలకు ఎటువంటి హాని జరగలేదు`` అంటూ టీజ్ చేస్తూ అలా నోట్లో బొద్దింక‌ను వేస్తోంది అన‌న్య పాండే.

ఇషాన్ ఖ‌త్త‌ర్- అన‌న్య జంట‌గా న‌టించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏమంత వెల‌గ‌లేదు. కానీ ఇప్పుడు టీవీ ప్రీమియ‌ర్ చూడండి అంటూ ప్ర‌చారం చేసేందుకు ఇలాంటి ఎత్తుగ‌డ వేసింది ఈ భామ‌. అన్న‌ట్టు రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఫైట‌ర్ మూవీలో న‌టిస్తోంది. ఆ మూవీ ప్ర‌చారానికి కూడా ఇలాంటి క్రియేటివిటీనే చూపిస్తుందా ఏమిటీ..!