Begin typing your search above and press return to search.

పుష్ప 2 కి ముందే రానున్న మంగళం శ్రీను.. దాక్షాయణి

By:  Tupaki Desk   |   10 July 2022 7:35 PM IST
పుష్ప 2 కి ముందే రానున్న మంగళం శ్రీను.. దాక్షాయణి
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప చిత్రంలో సునీల్‌ మంగళం శ్రీను పాత్రలో.. అనసూయ దాక్షాయని పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే. భార్య భర్తలుగా సునీల్‌ మరియు అనసూయలు పుష్ప లో కనిపించి మెప్పించారు. సినిమా క్లైమాక్స్ లో ఇద్దరి పాత్రలకు సంబంధించిన ట్విస్ట్‌ అదిరింది.

పుష్ప 2 లో మంగళం శ్రీను ఉంటాడా.. దాక్షాయణి పాత్ర ఎలాంటి టర్న్ తీసుకుంటుంది అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 కంటే ముందు వీరిద్దరు కలిసి ఒక సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అదే దర్జా సినిమా. ఈ సినిమా చాలా రోజులుగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను థియేట్రికల్‌ రిలీజ్ కు సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది.

దర్జా సినిమాను ఈ నెలలోనే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. జూలై 22వ తారీకున దర్జా సినిమాను విడుదల చేయడం జరుగుతుందని యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఈ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. సరైన సమయం కు వచ్చి ఉంటే తప్పకుండా మంచి బజ్ ఉండేది. కాని ఇప్పుడు పెద్దగా దర్జా గురించి చర్చ కనిపించడం లేదు.

విడుదలకు ఇంకా సమయం ఉంది కనుక అప్పటి వరకు ఈ సినిమా పై అంచనాలు పెరిగేలా యూనిట్‌ సభ్యులు ఏమైనా ప్రమోషన్ ను కొత్తగా చేస్తారా అనేది చూడాలి. ఈ ప్రమోసన్ కు సునీల్‌.. అనసూయలు రాబోతున్నారా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

మంగళం శ్రీను మరియు దాక్షాయణి గా ఇద్దరికి కూడా పుష్ప ద్వారా మంచి పాపులారిటీ దక్కింది. ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా అన్నట్లుగా పుష్ప పేరును ఉపయోగిస్తూ ప్రమోషన్‌ చేస్తే తప్పకుండా జనాల్లోకి బాగా వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా లో ఇద్దరి పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లు విడుదల అయ్యాయి. సినిమా పై ఆసక్తి పెరగడానికి ఇంకాస్త బెటర్ ప్రమోషన్ అవసరం అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం.