Begin typing your search above and press return to search.

అవసరం అయితే గుండు చేయించుకునేందుకు రెడీ

By:  Tupaki Desk   |   10 Nov 2021 8:38 AM GMT
అవసరం అయితే గుండు చేయించుకునేందుకు రెడీ
X
జబర్దస్త్‌ అనసూయ మరోసారి ఆకట్టుకుంది. ఎప్పుడు బోల్డ్‌ గా డ్రస్‌ లు వేసుకుని.. అందాలను చూపిస్తూ ఉంటుంది అంటూ జనాలు విమర్శల ఎదుర్కొనే అనసూయ ఒక అద్బుతమైన మేకోవర్ లో కనిపించింది. ఇద్దరు పిల్లల తల్లి ఇలాంటి డ్రస్ లు వేయడం ఏంటీ అంటూ విమర్శించిన వారు సైతం ఆమె పుష్ప లుక్ ను అలా చూస్తూ ఉండిపోతున్నారు. పుష్ప లో దాక్షాయని పాత్రలో ఆమె ఇన్వాల్వ్‌ అయిన తీరు అద్బుతం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ఇన్ని రోజులు ఆమెను విమర్శించిన వారు కూడా అంటున్నారు. రంగమ్మత్త కోసమే అనసూయ చాలా మారింది. దాక్షాయని కోసం మరే గ్లామర్‌ హీరోయిన్ కాని.. నటి గాని చేయని సాహసంను ఆమె చేసింది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

పుష్ప సినిమాలో బాల్ కట్టింగ్ తో చాలా మాసీ లుక్ లో మెడలో చాలా జ్యూవెలరీ మరియు చేతికి గిరిజనలు వేసేటువంటి ఆభరణాలు వేసుకుని దాక్షాయనిగా రంగమ్మత్త కనిపించిన తీరుకు అంతా కూడా నోరు వెళ్లబెడుతున్నారు. అనసూయ నిజంగా అద్బుతం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. పాత్ర డిమాండ్‌ చేస్తే అనసూయ ఎంత దూరం అయినా వెళ్తుంది.. ఎంతటి కష్టం అయిన పడుతుంది.. ఎలాంటి మేకోవర్‌ కు అయినా సిద్దం అవుతుంది అంటూ మరోసారి నిరూపించింది. ఈ అద్బుతమైన గెటప్ కు విమర్శకుల నుండి ప్రశంసలు అందుతున్న ఈ సమయంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ సమాధానం చెప్తు ఒక ఆసక్తికర విషయాన్ని కూడా తెలియజేసింది.

మీకు నా గురించి ఎలాంటి విషయాలు తెలుసుకోవాలని ఉంది అంటూ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మొదలు పెట్టింది. ఆ సమయంలో ఒక అభిమాని.. మీకు పెద్ద సినిమాలో మంచి రోల్‌ వస్తే.. అవసరం అయితే ఆ రోల్‌ కోసం గుండు కొట్టించుకుంటారా అంటూ ప్రశ్నించగా ఎలాంటి ఆలోచన లేకుండా అవసరం అయితే తప్పకుండా గుండు కొట్టించుకుంటాను అంటూ అనసూయ ఇచ్చిన సమాధానం టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. హీరోయిన్స్ గుండుతో కనిపించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అయితే క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తే మాత్రం అప్పుడప్పుడు అలాంటి పాత్రలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. పుష్ప సినిమాలో దాదాపుగా జుట్టు లేకుండానే అనసూయ నటించింది. అయితే అందుకోసం విగ్గు పెట్టుకుని ఉంటుంది. ముందు ముందు మంచి సినిమాలో పాత్రకు అవసరం అయితే తప్పకుండా ఆమె గుండు కొట్టించుకుంటుందేమో చూడాలి.