Begin typing your search above and press return to search.

నిత్య తర్వాత మహానటిగ మారిన అనసూయ

By:  Tupaki Desk   |   3 Dec 2018 10:40 PM IST
నిత్య తర్వాత మహానటిగ మారిన అనసూయ
X
మహానటి సావిత్రి పాత్ర పోషించడం.. ఆ పాత్రలో ప్రేక్షకులను మెప్పించడం ఆషామాషీ విషయం కాదు. కానీ కీర్తి సురేష్ మాత్రం 'మహానటి' సినిమాతో అలాంటి క్లిష్టమైన పనిని అవలీలగా చేసి ఆడియన్స్ అభిమానాన్ని చూరగొంది. 'మహానటి' ఘన విజయం సాధించడంతో కీర్తి కాకుండా సావిత్రి గారి పాత్ర వేరే ఎవరైనా చేస్తే జనాలు అసలు అంగీకరిస్తారా అని కూడా చర్చలు జరిగాయి. కానీ ఎన్టీఆర్ బయోపిక్ లో సావిత్రమ్మ గా ఫస్ట్ లుక్ లో కనిపించిన నిత్య మీనన్ కు మంచి మార్కులే పడ్డాయి. మరి ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ అయిన తర్వాత నిత్య మీనన్ ను కీర్తి సురేష్ లాగానే మహానటిగా ఆదరిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

ఇదిలా ఉంటే తాజాగా టీవీ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ సావిత్రమ్మ గెటప్ లో కనిపించింది. కానీ ఇది ఒక టీవీ యాడ్ కోసం. చందన బ్రదర్స్ వారి యాడ్ కోసం సావిత్రిగారిలా మారిపోయింది. 'మాయబాజార్' సినిమాలోని అహనా పెళ్ళి అంట పాట లిరిక్స్ ను కాస్త మార్చి ఈ యాడ్ ను చిత్రీకరించారు. ఇందులో సావిత్రమ్మ పోషించిన శశిరేఖ పాత్రలో అనసూయ నటించగా ఘటోత్కచుడి పాత్రలో నటించిన లెజెండరీ యాక్టర్ ఎస్వీ రంగారావు లాగా సింగర్ మనో కనిపించాడు.

మనో గెటప్ కు నెటిజనులు మంచి మార్కులే ఇచ్చారు గానీ అనసూయ గెటప్ కు మాత్రం పెద్దగా పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. రంగమ్మత్త ఆ గెటప్ వేయకుండా ఉంటే బాగుండేదని చాలామంది ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు. అనసూయ మంచి నటే గానీ శశిరేఖ గెటప్ లో ఉండాల్సిన గ్రేస్ మిస్ అయిందని అంటున్నారు.


వీడియో కోసం క్లిక్ చేయండి