Begin typing your search above and press return to search.
ఆమె ముందు హీరోయిన్ వెలవెల
By: Tupaki Desk | 29 Jan 2018 9:49 AM ISTఏదైనా సినిమా ఆడియో వేడుక జరిగితే.. అందులో కథానాయికే హైలైట్ అవుతుంటుంది. అందరి చూపులూ హీరోయిన్ మీదే ఉంటాయి. కానీ ‘గాయత్రి’ ఆడియో వేడుకలో మాత్రం దీనికి భిన్నమైన దృశ్యం కనిపించింది. ఈ వేడుకలో అందరి దృష్టినీ ఆకర్షించింది.. చర్చనీయాంశంగా మారింది యాంకర్ టర్న్డ్ యాక్ట్రెస్ అనసూయనే. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో గ్లామర్ షో చేసిన అనసూయ.. ఈ వేడుకలో రచ్చ రచ్చ చేసింది. హృదయం మీద వేయించుకున్న టాటూ కనిపించేలా ఆమె వేసుకున్న హాట్ డ్రెస్ హాట్ టాపిక్ అయింది. నిండుగా చీర కట్టి వచ్చిన ‘గాయత్రి’ హీరోయిన్ శ్రియ ఆమె అనసూయ ముందు తేలిపోయింది. కెమెరాల ఫోకస్ అంతా అనసూయ మీదే నిలిచింది.
ఇక కింద కూర్చున్నపుడు.. వేదిక ఎక్కడినపుడు అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. తెలుగులో మాట్లాడితే నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పలేనంటూ వయ్యారాలు పోవడమైతేనేమి.. మంచు ఫ్యామిలీకి ఒకప్పుడు తాను ఆస్థాన యాంకర్ అని చెప్పడమైతేనేమి.. మంచు ఫ్యామిలీ మంచితనం తన మీద ఇలాగే ఉండాలంటూ పంచ్ డైలాగ్ వేయడమైతేనేమి.. ఇలా అనసూయ చేసిన ప్రతి కామెంటూ హైలైటే. మనోజ్ సినిమా ‘మిస్టర్ నూకయ్య’కు తాను యాంకరింగ్ చేసే సమయానికి బేబీ స్టెప్స్ వేస్తున్నానని అనసూయ అంటే.. మధ్యలో మంచు విష్ణు లేచి వచ్చి.. ‘‘ఒరేయ్ మనోజ్.. మిస్టర్ నూకయ్య టైంకి ఈమె చిన్న పిల్ల అంటరా’’ అని కౌంటర్ వేశాడు. ఐతే తాను అప్పటికి బేబీని కాదని.. బేబీ స్టెప్స్ వేస్తున్నానని మాత్రమే అన్నానంటూ అనసూయ వివరణ ఇచ్చింది. ఆ తర్వాత మోహన్ బాబు మాట్లాడుతూ.. అనసూయ గురించి సరదాగా కౌంటర్లు వేయడం విశేషం.