Begin typing your search above and press return to search.
అచ్చు ఇలియానాలా.. అనసూయ
By: Tupaki Desk | 11 Sept 2017 9:37 AM ISTఅందచందాలు.. మాటకారితనం.. మెరిసే సొగసు.. మురిపించే వయ్యారం.. హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోని ఈ ఫీచర్లే అనసూయను స్టార్ యాంకర్ చేశాయి. ఓరకంగా యాంకరింగ్ కు హైడోస్ గ్లామర్ అద్దిన వాళ్లలో అనసూయ పేరు ముందుంటుందని ఒప్పుకోక తప్పదు. ఈ రోజుల్లో టీవీకి - సినిమాకు విడదీయరాని బంధం ఏర్పడిపోవడంతో అనసూయను సినిమా అవకాశాలు ఆమె తలుపు తడుతూనే ఉన్నాయి.
సోగ్గాడే చిన్నినాయనా సినిమాలో నాగార్ఝున పక్కన ఆడిపాడిన అనసూయే తర్వాత అడవి శేష్ హీరోగా నటించిన క్షణం సినిమాలో వైవిధ్యమైన పాత్ర చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసరుగా నటించిన అనసూయ నెగిటివ్ క్యారెక్టర్లో మెప్పించడం విశేషం. అనసూయ సినిమాల్లో నటించేది తక్కువే అయినా ఇండస్ట్రీకి అందుబాటులోనే ఉంటుంది. తాజాగా ఎన్టీఆర్ నటించిన జైలవకుశ థియేటరికల్ ట్రయిలర్ లాంచ్ ఈవెంటుకు మాంచి గ్లామరస్ లుక్ తో అనసూయ అటెండయ్యింది. ఈ డ్రస్ లో అనసూయను చూసిన చాలామందికి ఇలియానా గుర్తొచ్చింది.
ఇలియానా తెలుగులో చివరిగా జులాయి సినిమాలో కనిపించింది. అందులో ఆమె పాత్ర ఇంట్రడక్షన్ టైంలో ఓ కర్టెన్ వెనుక నుంచుని కనిపిస్తుంది. కర్టెన్ వెనుక నుంచున్నావేంటంటూ తండ్రి అడిగితే బయటే ఉన్నానంటూ కర్టెన్ కలర్ లో కలిసిపోయిన డ్రస్ తో బయటకొస్తుంది. ఇప్పుడు అనసూయ వేసుకొచ్చిన డ్రస్ కలర్ వేరు కావచ్చు కానీ ఆల్ మోస్ట్ లుక్ అలాగే ఉందంటూ ఆమెను చూసిన నెటజన్లు కామెంట్ చేస్తున్నారు. బెడ్ షీట్ తో డిజైన్ చేసినట్లు ఆ డ్రెస్ ఏంటి అనసూయ అంటున్నారు!!