Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అదిరేటి చీర కడితే
By: Tupaki Desk | 9 Sept 2016 10:31 AM ISTహాట్ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచమైన అనసూయా అనసూయా భరద్వాజ్ కి.. ఇప్పుడు బోలెడంత అభిమాన గణం ఉంది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ వైపు కూడా అనసూయ అడుగులు పడ్డా.. అవి తడబడకుండా ఈ భామ తీసుకునే జాగ్రత్తలను అదరహో అనాల్సిందే. అయితే.. ఆశించినన్ని అవకాశాలు రావడం లేదన్న మాట మాత్రం నిజమే. వచ్చినవి నచ్చకపోవడం.. నచ్చినవి రాకపోవడం కారణంగా.. ఎక్కువ సినిమాల్లో సందడి చేయలేకపోతోందీ సుందరాంగి.
తన ప్రతిభాపాటవాలతో పాటు సోయగాల పరువాలను ప్రదర్శించేందుకు.. మధ్యమధ్యలో ఫోటో షూట్ లను ఆశ్రయించడం అనసూయకు అలవాటే. అయితే.. ఎప్పుడూ కనిపించే అందాల ప్రదర్శన మాదిరిగా కాకుండా.. ఈసారి నిండైన చీర కట్టుతో కొత్తగా కనిపించింది అనసూయ. అయినా సరే తన గ్లామర్ టచ్ మాత్రం ఇచ్చింది లెండి. ఉండే లేనట్లుగా చేతులు ఉన్న ఆ రవికకు.. ముందరి వైపున ఓ విండో పెట్టి మరీ చూపులు తిప్పుకోకుండా చేసేసింది. ఇక వేళ్లకు మెరిసే ఉంగరాలు.. చేతికి నిండుగా గాజులు.. చెవులకు చక్కని దిద్దులు.. అన్నీ బంగారు వర్ణంలో మెరిసిపోయేవే.
మేలిమి బంగారంలా మెరిసిపోతున్న ఈ భామ అసలు లక్ష్యం ఇంకా అందుకోలేదనే చెప్పాలి. మరి సోగ్గాడులో ఓ చిన్ని పాత్ర ఇచ్చి ప్రోత్సహించిన బంగార్రాజుకు.. ఈ బంగారం ఈ సారి కూడా కంటికి ఆనితే.. ఇక అమ్మడిని ఆపతరమా!