Begin typing your search above and press return to search.

ఆ మడతల లెక్కేంటి అనసూయా?

By:  Tupaki Desk   |   26 Dec 2015 3:59 AM GMT
ఆ మడతల లెక్కేంటి అనసూయా?
X
టాలీవుడ్ లో యాంకరింగ్ నుంచి హీరోయిన్ గా క్లిక్ అయిన వాళ్లని లెక్క పెట్టేందుకు పెద్ద కష్టం అవసరం లేదు. స్వాతి తప్ప మరొకరు ఎవరూ కనిపించరు. ఇప్పుడు మాత్రం ఇద్దరు భామలు జబర్దస్త్ గా ట్రై చేసేస్తున్నారు. అనసూయ - రేష్మీల్లో ఇప్పుడు చెప్పుకోవాల్సింది అనసూయ గురించే.

జబర్దస్త్ చేస్తున్నప్పటి నుంచే అందులో అమ్మడు ఒలకబోసిన గ్లామర్, హొయలకి బోలెడంత మంది ఫిదా అయిపోయారు. టాలీవుడ్ నుంచి కూడా వరుసగా ఛాన్సులు వచ్చాయి. ఏకంగా పవర్ స్టార్ సినిమాలో కూడా ఆఫర్ వచ్చింది. అయితే ఇది ఐటెం సాంగ్ కావడంతో వద్దనేసింది అనసూయ. చేస్తే హీరోయిన్ గా చేస్తే.. లేకపోతే ఇలాగే ఉంటాను అనేసింది. ఇన్నాళ్లకి నాగ్ సినిమాతో వెండి తెరంగేట్రం చేస్తోంది అనసూయ.

ఎప్పుడూ యాంకర్ గా ఆడియో ఫంక్షన్లకి వచ్చే ఈమె.. ఇప్పుడో హీరోయిన్ గా సోగ్గాడే చిన్ని నాయన పాటల వేడుకకు హాజరైంది. తన గెటప్ నుంచి మొత్తం గ్లామర్ తో కుమ్మేసింది. బ్యాక్ లెస్ జాకెట్ తో తన ట్యాలెంట్ ఏంటో చూపించేసింది. తన పాత్ర పేరు చెప్పడానికి కూడా డైరెక్టర్ ను పర్మిషన్ అడిగి.. తాను దర్శకుల హీరోయిన్ గా ఎదగాలని కోరుకుంటున్నట్లు ఇన్ డైరెక్టుగా ఇండస్ట్రీకి సూచనలు ఇచ్చింది.

కాకపోతే.. ఈతరం హీరోయిన్లతో పోల్చితే, అనసూయ కొంచెం భారీ పర్సనాలిటీయే. అయినా సరే అందాలు ప్రదర్శించడంలో హీరోయిన్లనే డామినేట్‌ చేసేస్తానంటోంది. గ్లామర్‌ తో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించేస్తోంది. కానీ నిండైన బొద్దు పర్సనాలిటీ కావడంతో.. నడుం మీద మడతలు ఎక్కువగానే పడుతున్నాయి. ఇంకో రెండు ఆఫర్స్ వస్తే.. అవి కూడా కరిగిపోవచ్చు లెండి. అయితే.. హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటే మాత్రం.. తొలిసారిగా ఓ పెళ్లైన యువతి గా టాలీవుడ్‌ లో పాపులారిటీ సంపాదించుకున్న మొదటి హీరోయిన్ అవుతుంది.