Begin typing your search above and press return to search.

అనసూయ యాటిట్యూడ్ వీడియో.. ఇంతకీ ఏం చెబుతుంది..?

By:  Tupaki Desk   |   27 Oct 2022 1:30 PM GMT
అనసూయ యాటిట్యూడ్ వీడియో.. ఇంతకీ ఏం చెబుతుంది..?
X
జబర్దస్త్ యాంకర్ అనసూయ రెగ్యులర్ గా వార్తల్లో ఉంటుంది. వివాదాల్లో ఉండే బుల్లితెర యాంకర్ అంటే అనసూయ పేరే ఎక్కువ వినిపిస్తుంది. మిగతా వారంతా కూడా తమ షోలు ఏంటో తామేంటో అన్నట్టు ఉంటారు. కానీ అనసూయ మాత్రం తనకు సంబంధం లేని విషయాలని ప్రస్థావించి మరి వివాదాల్లో ఉంటుంది. అర్జున్ రెడ్డి టైం లో ఆమె చేసిన కామెంట్స్ రౌడీ హీరో ఫ్యాన్స్ ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి.

ఇక ఈమధ్య లైగర్ ఫెయిల్ అయినప్పుడు కూడా అనసూయ కామెంట్ మరోసారి ఆమెని వార్తల్లో నిలిచేలా చేసింది. ఆ టైం లోనే విజయ్ ఫ్యాన్స్ అంతా ఆమెని ఆంటీ అని ఎటాక్ చేశారు. తనపై ఆంటీ అంటూ ట్రోల్ చేసిన వారందరి మీద అనసూయ పోలీస్ కేస్ కూడా పెట్టింది.

ఆ కేసు ఎక్కడ వరకు వచ్చింది అన్నది తెలియదు కానీ మరోసారి తన వీడియోతో ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చింది అనసూయ. తన మీద ట్రోల్ చేసే నాస్టీ పీపుల్ కి తన యాటిట్యూడే సమాధానం అంటూ ఓ హాలీవుడ్ సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ.

మోడ్రెన్ వేర్ తో నడుము అందాలు చూపిస్తూ అనసూయ లేటెస్ట్ వీడియో మరోసారి ట్రోలర్స్ ని నిద్ర లేపిందని చెప్పొచ్చు. వెనక ఉండి ట్రోల్ చేసే నాస్టీ ట్రోలర్స్ కు నా యాటిట్యూడే సమాధానమని.. తనని ఫ్యామిలీలా ప్రేమించే ఎంతోమంది అభిమానులు ఉన్నారంటూ కామెంట్స్ పెట్టింది అనసూయ.

అనసూయ షేర్ చేసిన ఈ వీడియో నెటిజెన్లు మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. ఆంటీ అంటూ తెరలేపిన ఆ గొడవ సర్ధుమనిగింది అనుకుంటుంటే తన యాటిట్యూడ్ తోనే అలాంటి వారికి సమాధానం ఇస్తానని ఈ లేటెస్ట్ వీడియోతో మళ్లీ అగ్గి రాజేసింది అనసూయ.

మరి అనసూయ వీడియో ప్రభావం ఎలా ఉంటుందో చూడాలి. ఇక అనసూయ సినిమాల విషయానికి వస్తే పుష్ప 2లో దాక్షాయణి పాత్ర కొనసాగింపు ఉండగా.. కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక పర్మినెంట్ గా ఒక షో చేయకపోయినా అడపాదడపా స్మాల్ స్క్రీన్ లో కనిపిస్తుంది అనసూయ. ఇప్పుడు పూర్తిగా సినిమాల మీదే ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయ్యింది అనసూయ. క్రిష్ డైరక్షన్ లో ఓ వెబ్ సీరీస్ కోసం బల్క్ డేట్స్ ఇచ్చినట్టు టాక్.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.