Begin typing your search above and press return to search.
అనసూయ కౌంటర్ కి నెటిజన్ పలాయనం
By: Tupaki Desk | 7 April 2021 4:30 AM GMTరంగుల ప్రపంచంలో గ్లామర్ ఒలకబోస్తే అవకాశాలొచ్చేస్తాయని అనుకుంటే పొరపాటే. ఇక్కడ ప్రతిభతో పాటు ప్రతి నిమిషం దూసుకుపోయే తత్వం కావాలి. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. అలాగే సమస్య ఎదురైతే పరిష్కరించుకోవడం.. మారిన ట్రెండ్ ని అనుసరించి ఎలివేట్ అవ్వడం ఇవన్నీ చాలా చాలా అవసరం. ఇలా ఏ కోణంలో చూసినా యాంకర్ కం నటి అనసూయ ది బెస్ట్ అని నిరూపిస్తున్నారు.
సోషల్ మీడియాల్లో అనసూయ ఒక వేవ్. ఎదుటివారిపై కౌంటర్లు వేయడంలోనూ ఒక స్టైల్ ఉంది. ఈ వేదికపై సెలబ్రిటీలను తిట్లు తిడతారు. బూతులు భరించాలి. వెకిలి వేషాలు వేసేవాళ్లుంటారు. అన్నిటికీ చెక్ పెట్టాలి. కౌంటర్లు వేయాలి. ఇది నిరంతర ప్రక్రియ. ఇందులో ఎంతో అనుభవం ఘడించిన అనసూయ ఓసారి ఒక నెటిజన్ అసభ్య ప్రవర్తనకు తాను ఎలా కౌంటర్ వేసారో చెప్పారు. అదేమిటో తెలిస్తే.. ఔరా! అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఇంతకీ ఆ నెటిజను ఏమని అడిగాడు? అంటే.. అనసూయ ఇలా చెప్పారు.``కొన్నాళ్ల క్రితం ఒకడు.. నువ్వు పడుకోబట్టే ఇండస్ట్రీలోకి వచ్చావ్.. ఈ స్థాయిలో ఉన్నావంటే కారణం అదే కదా!`` అని కామెంట్ చేశాడు. దానికి నా సమాధానం.. `` మీ ఇంట్లో వాళ్లూ అంతేనా?`` అనడిగాను. దెబ్బకు వాడు కామెంట్ ను డిలీట్ చేసేశాడు.. అని తెలిపారు. ఇలాంటి మెడిసిన్ ఇస్తేనే దారికొస్తారు. అందుకే అప్పటి నుంచి వెంటనే కౌంటర్లు వేస్తున్నానని తెలిపారు. ఇటీవల ఆ కామెంట్లను తాను పెద్దగా పట్టించుకోవడమే లేదని కూడా అన్నారు.
రంగమార్తాండ-థ్యాంక్యూ బ్రదర్ -వేదాంతం రాఘవయ్య- ఖిలాడీ చిత్రాల్లో అనసూయ నటిస్తున్నారు. పవన్- క్రిష్ సినిమాలోనూ ఓ కీలక పాత్రను అనసూయ పోషిస్తున్నారు.