Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: పెళ్ల‌యినా ఎక్క‌డా త‌గ్గేదేలే..!

By:  Tupaki Desk   |   17 Sept 2021 9:00 AM IST
ట్రెండీ టాక్‌: పెళ్ల‌యినా ఎక్క‌డా త‌గ్గేదేలే..!
X
యాంక‌ర్ స్టాయి నుంచి హోస్ట్ గా.. ఆ త‌రువాత ప్రాధాన్య‌త వున్న న‌టిగా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది అన‌సూయ‌. జ‌బ‌ర్ద‌స్త్ షోతో పాపుల‌ర్ అయిన ఈ అమ్మ‌డు నాగ్ న‌టించిన `సోగ్గాడే చిన్ని నాయ‌నా` చిత్రంతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చేసింది. చెక్క‌ర‌కేళి చిన్నోడే.. అంటూ హోయ‌లు పోతూ నాగ్ తో అన‌సూయ వేసిన స్టెప్పులు ఆమెకు మంచి గుర్తింపుని అందించ‌డంతో పాటు వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని తెచ్చిపెట్టింది.

`రంగ‌స్థ‌లం`లో న‌టించిన రంగ‌మ్మ‌త్త క్యారెక్ట‌ర్ అనసూయని న‌టిగా మ‌రో లెవెల్ కి తీసుకెళ్లింది. విభిన్న‌మైన పాత్ర‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌వాల‌న్న‌ది అన‌సూయ కోరిక‌. అందుకు త‌గ్గ‌ట్టుగానే న‌ట‌న‌కు ప్రాధాన్య‌త వున్న పాత్ర‌ల్నే ఎంచుకుంటూ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెర‌కెక్కిస్తున్న‌ యాక్షన్ డ్రామా పుష్పలో అన‌సూయ అత్యంత శ‌క్తివంత‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' లో అనసూయ టీవీ ఛానెల్ హెడ్ గా కనిపించనుంది. రవితేజ 'ఖిలాడీ', .. కృష్ణవంశీ 'రంగమార్తాండ'లో కూడా ఆమెను విభిన్న అవతారంలో మ‌నం చూడొచ్చు.

తాజాగా అన‌సూయ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. దర్శకుడు సంపత్ నంది ఓ కొత్త ద‌ర్శ‌కుడితో ఈ మూవీని నిర్మించ‌బోతున్నారు. బుల్లితెరపై గ్లాం గర్ల్ గా పేరు తెచ్చుకున్న అన‌సూయ సినిమాల్లో మాత్రం ఛాలెంజింగ్ రోల్స్ చేస్తోంది. సినిమాల్లో న‌టిస్తూనే బిల్లితెర‌పై కూడా రాణిస్తోంది. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తోంది. అంతేనా సోష‌ల్ మీడియాలో త‌న‌ని ఎంత‌గా ట్రోల్ చేసినా వ‌రుస ఫొటోషూట్ ల‌తో క‌ల‌ర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఆక‌ట్టుకుంటోంది. తాజాగా అన‌సూయ ఎల్లో క‌ల‌ర్ లంగా వోణీ ధ‌రించి ఫొటోల‌కు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన ఫొటోలు సంద‌డి చేస్తున్నాయి. ఇద్ద‌రు పిల్ల‌కి త‌ల్లి అయినా అన‌సూయ‌లో ఏమాత్రం గ్లామ‌ర్ త‌గ్గ‌లేద‌ని తాజా ఫొటోషూట్ నిరూపిస్తోంది. ప‌రికిణీలో అన‌సూయ గ్లామ‌ర్ ని చూసిన వారంతా పెళ్లైనా ఎక్క‌డా త‌గ్గేదేలే అంటున్నారు.