Begin typing your search above and press return to search.

అన‌సూయ క‌ళ్ల‌లో అయ‌స్కాంత మెరుపులు

By:  Tupaki Desk   |   3 Feb 2023 10:10 AM
అన‌సూయ క‌ళ్ల‌లో అయ‌స్కాంత మెరుపులు
X
పోటీ ఎంత ఉన్నా టాలీవుడ్ లో టాప్ యాంక‌ర్ గా హవా సాగిస్తోంది అన‌సూయ‌. మ‌రోవైపు వెండితెర‌పై స‌హాయ‌న‌టిగా భారీ క్రేజ్ ను సంపాదించుకుంది. పుష్ప చిత్రంలో అద్భుత న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న అన‌సూయ పుష్ప 2 లో మ‌రింత ఆస‌క్తిక‌ర స‌న్నివేశాల‌తో ఆక‌ట్టుకుంటుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

జబర్దస్త్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ పాపులారిటీ గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. ద‌శాబ్ధం పైగానే టెలివిజన్ వ్యాఖ్యాతగా న‌టిగా రాణించిన‌ అనసూయ భరద్వాజ్ అనేక కామెడీ షోలతో అసాధార‌ణ‌ పాపులారిటీ ద‌క్కించుకుంది. క్షణం- రంగస్థలం- పుష్ప: ది రైజ్ వంటి చిత్రాలలో అత్యుత్తమ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. సోష‌ల్ మీడియాల్లో ల‌క్ష‌లాదిగా ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈ వేదిక‌ల‌పై తన వృత్తిగ‌త‌ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేస్తుంటారు. ఇటీవ‌ల అన‌సూయ స‌కుటుంబ స‌మేతంగా జ‌రుపుకున్న‌ సంక్రాంతి వేడుకల నుండి కొన్ని ఫోటోలు వైర‌ల్ అయ్యాయి.

తాజాగా మ‌రో కొత్త ఫోటోషూట్ తో అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈసారి నీలి రంగు చీర‌లో బ్యాక్ లెస్ లుక్ తో క‌ట్టి ప‌డేసిన అనసూయ క్లోజ‌ప్ షాట్ లో స‌రికొత్త ముఖాభిన‌యంతో ఆక‌ట్టుకుంది. ఆ క‌ళ్ల‌లో ప్ర‌త్యేక మెరుపులు మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించాయి. అయితే ఆక‌స్మికంగా ఆ క‌ళ్ల‌లో ఈ కొత్త‌ మెరుపులు ఎలా పుట్టుకొచ్చాయి? అన‌సూయ క‌ళ్ల‌లో అయ‌స్కాంత మెరుపులు క‌నిపిస్తున్నాయి.. ఇంత‌లోనే ఆ స్పెష‌ల్ అట్రాక్ష‌న్ ఎలా పాజిబుల్? అంటూ ఆరాలు తీయ‌డం మొద‌లైంది. అయితే కొంద‌రు అభిమానులు దీనిని వెంట‌నే డీకోడ్ చేశారు. ఇదంతా లెన్స్ మాయాజాలం. క‌ళ్ల‌కు పవ‌ర్ లెస్ లెన్స్ ను ఉప‌యోగించ‌డం ఈరోజుల్లో చాలా సులువు.

ఖ‌ర్చు కూడా ఏమంత కాస్ట్ లీ కాదు. నెల‌కు రూ.250 పెడితే చాలు ఐలెన్స్ న‌చ్చిన రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. మ‌రి కాస్త ప్రీమియంకి వెళితే రూ.800-1000 లోపు ఖ‌రీదుతో లెన్స్ ని కొనుగోలు చేయొచ్చు. ఏదేమైనా స్టార్ గా వెలుగులు విరజిమ్మాలంటే ఆర్టిస్టులు ఎప్ప‌టిక‌ప్పుడు క్రియేటివ్ గా త‌మ‌ను తాము ఆవిష్క‌రించుకోవాల్సి ఉంటుంది. ప్ర‌తిసారీ నిత్య‌నూత‌నంగా వైవిధ్య‌మైన ఫోటోషూట్ల‌తో అల‌రించాలి. అన‌సూయ ప్ర‌య‌త్నం అందుకు అతీత‌మైన‌ది కాదు.

స‌హాయ‌న‌టిగా అన‌సూయ కెరీర్ మ్యాట‌ర్ ప‌రిశీలిస్తే.. అల్లు అర్జున్ 'పుష్ప: ది రైజ్'లో అన‌సూయ‌ పాత్రకు గొప్ప‌ ప్రశంసలు లభించాయి. క‌నిపించింది కొద్ది సేపే అయినా బ్లేడ్ బాబ్జీకి అక్క‌గా అద‌ర‌గొట్టింది. ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న పుష్ప 2: ది రూల్ (సీక్వెల్‌)లో త‌న పాత్ర ప‌రిధి మ‌రింత విస్త్ర‌తంగా ఉంటుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

కృష్ణ వంశీ తెర‌కెక్కిస్తున్న 'రంగ మార్తాండ' లోను అన‌సూయ కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. ఈ చిత్రాన్ని అభిషేక్ జావ్కర్- మధు కలిపు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రంగ‌మార్తాండ‌కు ప్రకాష్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఇళయరాజా సంగీతం అందించారు. రంగ మార్తాండ అనేది నానా పటేకర్ న‌టించిన‌ మరాఠీ క్లాసిక్ 'నటసామ్రాట్' కి అధికారిక రీమేక్.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.