Begin typing your search above and press return to search.

ప్రైవేట్ పార్ట్స్ పై రచ్చ. అనసూయ కామెంట్స్..!

By:  Tupaki Desk   |   3 July 2023 10:38 AM GMT
ప్రైవేట్ పార్ట్స్ పై రచ్చ. అనసూయ కామెంట్స్..!
X
టాలీవుడ్ హాట్ యాంకర్ అనగానే ముందుగా అనసూయ పేరు వినపడుతుంది. జబర్దస్త్ కామెడీ షోకి యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టిన ఆమె ప్రస్తుతం టాలీవుడ్ బిజీ నటిగా మారిపోయింది. ఎప్పుడైతే రంగస్థలం సినిమా చేసిందో, అప్పటి నుంచి ఆమెకు వరసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. నటిగా తన కెరీర్ కి ఉపయోగపడే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది.

ఇదంతా ఓ వైపు అయితే, ఆమె నిత్యం ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. ఇక మరోసారి ఊహించని విధంగా రియాక్ట్ అయిన అనసూయ వార్తల్లో నిలిచింది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే, ఇటీవల యాంకర్ రష్మి గౌతమ్ హిందూ మతం గురించి కామెంట్ చేసింది. హిందూ మతం, కులాలు, మత మార్పిడుల టాపిక్‌పై రీసెంట్‌గా కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. దీనిపై కొందరు ఆమెతో వాగ్వాదానికి దిగారు.

అయితే, ఈ విషయంలో ఆమె ధైర్యంగా మాట్లాడటంపై ఓ అభిమాని తనను ప్రశంసిస్తూ ట్వీట్ చేశాడు. ‘బాల్స్ కలిగిన సినీ పరిశ్రమకు చెందిన కొందరు వ్యక్తులు ఇలాంటి టాపిక్స్ మాట్లాడుతున్నారు’ అంటూ ట్వీట్‌లో అనసూయ పేరు మెన్షన్ చేశాడు. అయితే సదరు ట్వీట్‌లో అనసూయ ప్రస్తావన తీసుకురావడం అసలు వివాదానికి కారణమైంది. తన ప్రస్తావన తీసుకురావడంతో, అనసూయ కూడా వెంటనే రియాక్ట్ అయ్యింది.

రియాక్ట్ అవ్వడమే కాకుండా, ప్రైవేట్ పార్ట్స్ గురించి మెన్షన్ చేస్తూ, అనసూయ కామెంట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. తనకు బాల్స్ లేవని, కానీ తనకు పూర్తిగా తెలిసిన విషయాలపై మాట్లాడటానికి V**** ఉందని ఆమె అన్నారు.

అలాగే మనలో ప్రతి ఒక్కరికీ వివిధ రకాల టాపిక్స్‌పై అటెన్షన్ ఉంటుందని, ఇక్కడ చాయిసెస్ అనేవి పూర్తిగా వ్యక్తిగతమన్నారు. అందరూ ఒకేలా స్పందించాలనుకోవడం న్యాయం కాదు అంకుల్ అంటూ అనసూయ కామెంట్స్ చేశారు.

ఇప్పుడు, అనసూయ ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. కొందరు ఆమె ధైర్యానికి ఫిదా అయిపోతున్నారు. బలే ఆన్సర్ చెప్పారు అంటూ ప్రశంసిస్తున్నారు. కానీ, కొందరు మాత్రం ఇవేమి కామెంట్స్, మరీ ఇంత బోల్డ్ గా సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.