Begin typing your search above and press return to search.
దమ్ముంటే ఆ బూతుకి అర్ధం చెప్పండి -అనసూయ
By: Tupaki Desk | 2 Sept 2017 9:54 AM ISTఅర్జున్ రెడ్డిపై హంగామా.. వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. మొన్నటికి మొన్న యాంకర్ కం యాక్టర్ అనసూయ.. ఈ సినిమాలో అమ్మను తిట్టే బూతులు ఘోరం అంటూ.. ఆ మూవీ చూడలేనని చెప్పేసింది. అలాగే.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యూనిట్ బూతులు మాట్లాడడాన్ని ఖండించింది. అనసూయ వాదనపై విమర్శలు.. ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి.
బయట ఇలాగే మాట్లాడుకుంటున్నారు కాబట్టి.. పెద్దగా పట్టించుకోనవసరం లేదన్నది కొందరి వాదన. అయితే.. అమ్మను తిట్టడం అనే పాయింట్ ను మాత్రం జీర్ణించుకోలేని విషయం అంటుంది అనసూయ. రీసెంట్ గా ఈమె ఓ ఛానల్ లో లైవ్ షోకి వచ్చింది. అక్కడ సినిమాలో కంటెంట్ బాగుందని అంటూనే.. సినిమా బాగా తీశారని అంటూనే.. వినిపించిన బూతులను మాత్రం ఖండించింది. "ఇంటర్వ్యూలలో ఎంసీ ఎంసీ అని పదం వాడుతున్నారు కదా.. దమ్ముంటే ఆ యూనిట్ లో ఎవరైనా వచ్చి దానికి సరైన తెలుగు అర్ధం ఏంటో చెప్పండి చూద్దాం" అంటూ సవాల్ విసిరింది. అర్జున్ రెడ్డి ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆ పదాన్ని మ్యూట్ చేయించారంటూ.. తన తరఫున జనాలను ఆ మా...ద్ పదానికి డబ్బింగ్ చెప్పమని విజయ్ దేవరకొండ అన్నప్పటి నుంచి ఈ వివాదం నానుతూనే ఉంది.
ముద్దు అనే కల్చర్ ఎప్పటి నుంచి ఉందని.. దాన్ని చూపించడం తప్పు లేదని వాదిస్తున్న టీంకు కూడా అనసూయ బాగానే రిటార్ట్ ఇచ్చింది. "ఒకప్పుడు డ్రెసింగ్ ఉండేది కాదు. రాజుల కాలంలో ఎక్కువగా ఎక్స్ పోజింగ్ ఉండేదంటారు. నేను ఇప్పుడు కాళ్లు మాత్రమే చూపిస్తున్నా. అప్పటి నుంచే ఉన్నదే ఇప్పుడు చేస్తున్నా అనేందుకు బదులు.. మీరు మార్చవచ్చు కదా.. కొత్తగా ట్రై చేయచ్చు కదా" అంటూ అనసూయ చేసిన కామెంట్స్ లో పాయింట్స్ చాలానే ఉన్నాయి.