Begin typing your search above and press return to search.
కామెంట్: ఎందుకు అనసూయ ఈ తిప్పలు?
By: Tupaki Desk | 15 July 2015 11:01 AM GMT''నేను ఎక్స్‌ప్రెసివ్.. బాగా ఎక్స్‌ప్రెసివ్.. మనస్సులో ఏమీ ఉంచుకోలేను.. ఏదైనాసరే ఓపెన్‌గా చెప్పేస్తాను..'' ఈ యాటిట్యూడ్‌తో గతంలో పవన్ కళ్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో ఎందుకు పనిచేయలేదో వివరించిన యంకర్ అనసూయ ఇప్పుడు మరోసారి సేమ్ అలానే మరో మెగా హీరోను టార్గెట్ చేసింది. అయితే ఈసారి ఫ్యాన్స్ కాసింత గట్టిగా రియాక్ట్ అయ్యారు. ఎంత ఎక్స్‌ప్రెసివ్ అయితే మాత్రం ఈ రేంజులో విమర్శిస్తావా అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. దీనిపై మళ్ళీ క్లారిటీ ఇచ్చింది అనసూయ.
మొన్న ఒక ఇంటర్యూలో మాట్లాడుతూ.. ''అసలు గంగోత్రి సినిమా చూసి షాకయ్యాను. మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంతమాత్రాన ఇతను హీరో ఏంటి అనుకున్నా. ఆ లంగా వోణిలో డ్యాన్సులు చూస్తే.. యాక్.. కాని ఆర్య సినిమాతో బన్నీ ఒక్కసారిగా మారిపోయాడు'' అంటూ బన్నీపై తన ఫీలింగ్స్‌ను చెప్పేసింది అనసూయ. నీకెంత ధైర్యం ఉంటే ఇంత ఛండాలంగా మా హీరో గురించి వర్ణిస్తావ్ అంటూ ఈ కామెంట్లపై చాలామంది అభిమానులు సీరియస్ అయిపోయారు. వెంటనే అనసూయను ఫేస్‌బుక్‌లో వల్గర్ మాటలతో తిట్టడం స్టార్ట్ చేశారు. విస్తుపోయిన అనసూయ, వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయించేసి.. దాని స్థాయిలో మరో ఎమోషనల్ వీడియోతో విచ్చేసింది.
''నేను నా ఫీలింగ్స్ చెప్పాను తప్పా? నేను కాస్త ఎక్‌ప్రెసివ్, మనస్సులో ఏదుంటే అదే చెప్తాను. అలా చేయడం కూడా తప్పేనా? మీరు నన్ను తిట్టండి, కాని దానికి ఒక హద్దుంటుంది. మా ఫ్యామిలీని అంతటినీ కలిపి బూతులు తిడుతున్నారే, ఇది మీకు సమంజసమేనా?'' అంటూ వాపోయింది అనసూయ. గతంలో కూడా అత్తారింటికి దారేది సినిమాలో తాను చేయదగిన రేంజ్ క్యారెక్టర్ ఏదీ లేదు అని చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు బలైంది అ జబర్‌దస్త్ బ్యూటి. ఇదే విషయంపై ఫ్యాన్స్ వాదన మరోలా ఉంది.
ఒకవేళ అనసూయ ఎంత ఎక్స్‌ప్రెసివ్ అయినా కూడా మెగా ఫ్యామిలీ నుండి వచ్చినంత మాత్రాన హీరో అయిపోతాడా అని అనుకున్నానంటూ చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఫీలింగ్స్ మనస్సులో ఉంచుకుంటే బెటర్ కాని, ఎంతో సెన్సిటివ్‌గా ఉండే ఫ్యాన్స్ ముందు అవి చెప్పేస్తే ఎలా? సెలబ్రిటీ అయినప్పుడు కాస్త సెన్సిబిలిటీ కూడా మెయిన్‌టైన్ చేయాలి కదా? ఎలాగైతే తను ఎక్స్‌ప్రెసివ్‌గా పబ్లిక్ డొమైన్‌లో తన ఆలోచనలు షేర్ చేసుకునే ఫ్రీడం తనకుందని అనసూయ అనుకుంటుందో.. ఈవెన్ ఫ్యాన్స్ కూడా అలాగే అనుకుంటున్నారు. అక్కడే వచ్చింది సమస్యంతా.. అసలు హీరోలపై అలాంటి హార్ష్ కామెంట్లు చేయడం ఎందుకు, ఇలా బ్యాక్‌ల్యాష్ ఎదుర్కోవడం ఎందుకు? వై అనసూయ, వై దిస్ కొలవెరి?