Begin typing your search above and press return to search.
అనసూయ ఫెర్మార్మెన్స్ అదుర్స్!
By: Tupaki Desk | 28 July 2015 4:48 AM GMTకాస్త ఆలస్యం అయ్యింది కానీ... లేకపోతే వెండితెరపై పెద్ద స్టార్ హీరోయిన్ అవడానికి కావలసిన అన్నిరకాల అర్హతలు పుష్కలంగా ఉన్న బ్యూటీ అనసూయ! పాత సినిమా హీరోయిన్స్ లాంటి పేరు, కొత్త సినిమా హీరోయిన్స్ లాంటి అందం, హడావిడి! మైక్ కనిపిస్తే అనర్గలంగా దూసుకువచ్చే మాటలను కలిగి ఉన్న అనసూయ... ఈ మధ్య స్టేజ్ కనిపిస్తే చాలు కాలుదువ్వేస్తుంది! తనదైన హావబావాలతో, ఎక్స్ పోజింగ్ తో... నడుము ఒంపులతో, నాట్యభంగిమలతో ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేసేస్తొంది. తాను వేసే స్టెప్పులతో కుర్రకారుని తమ తమ సీట్లలో కూర్చోనివ్వడం లేదన్నా అతిశయోక్తి కాదేమో!
సినిమా పెద్దలు పాల్గొనే ఏ స్టేజ్ పై అయినా దొరికిన అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవడం లేదు. తాజాగా హైదరాబాద్ లో జరిగిన సిని మా అవార్డ్స్ ఫంక్షన్ లో తన పెర్ఫార్మెన్స్ తో వెండితెర అభిమానులను, పెద్దలను ఆకట్టుకుంది! ఇటువంటి వేదిక మరలా ఎప్పుడు దొరుకుతుందో ఏమో అనుకున్న అనసూయ గతంలో ఎప్పుడూ రెచ్చిపోని స్థాయిలో చెలరేగిపోయింది! ఇప్పుడిప్పుడే వెండితెరపై అవకాశాలను అందిపుచ్చుకుంటున్న అనసూయ... ఈ రేంజ్ లో రెచ్చిపోయిందంటే... మరిన్ని అవకాశాలు అందుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది! ఆ స్టేజ్ పై ఫెర్మార్ చేసిన ఏ హీరోయిన్ కి తీసిపోని రేంజ్ లో అనసూయ దుమ్మురేపేసింది! దీని ఫలితం ఎప్పటికి వస్తుందో వేచి చూడాలి మరి!