Begin typing your search above and press return to search.

డాన్స్ డే స్పెషల్.. అనసూయ వయ్యారంగా చిందేస్తే..!

By:  Tupaki Desk   |   29 April 2020 11:06 PM IST
డాన్స్ డే స్పెషల్.. అనసూయ వయ్యారంగా చిందేస్తే..!
X
తెలుగు టీవీ యాంకర్‌ అనసూయ ఎంత మాటకారో.. అంతే సొగసరి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అనసూయ ఈ మధ్య ఏం చేసినా వైరల్ అవుతోంది. ఫోటోషూట్లలో వయ్యారాలు ఒలకబోస్తే కుర్రకారు సంగతి అంతే. తాజాగా లైవ్‌లోకి వచ్చిన అనసూయ సౌందర్యలహరిలా నాభి అందాలు చూపించి యూత్ హృదయాలను కొల్లగొట్టింది. ఇటీవలే ఫ్యాన్స్ అడగగానే ఇన్‌ స్టాగ్రామ్ లైవ్‌ లోకి వచ్చిన అనసూయ తన చీరకట్టులో అందాలు అందరి మతులు పోగొట్టాయి. ఇక అనసూయ తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ క్వారంటైన్‌ లో ఏం చేస్తున్నారని అడిగితే.. వంటింట్లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నానని తెలిపింది. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూ.. వంట ఎలా చేయకూడదదో తెలుసుకుంటున్నట్లు చెప్పింది.

నేడు ఏప్రిల్ 29 కనుక అంతర్జాతీయ నృత్య దినోత్సవం. ఈ సందర్భంగా సెలెబ్రిటీలంతా డ్యాన్సులు చేస్తూ సరదాగా గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో నేడు డ్యాన్స్ ఛాలెంజ్ అనేది ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ - అల్లు అర్జున్ - ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరోల బెస్ట్ మూమెంట్స్‌ను తెగ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనసూయ రంగంలోకి దిగింది. ఇక అనసూయ కాలు కదిపితే సోషల్ మీడియా షేక్ అయిపోవాల్సిందే. అది కూడా బుల్లి నిక్కరేసుకొని కిచెన్ లో పనులు చేసుకుంటూ వయ్యారంగా ఓ ఊపు ఊపేసింది. డాన్స్ డే రోజు అనసూయ అందాల విందుకు ఫ్యాన్స్ అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.