Begin typing your search above and press return to search.
డబ్బింగ్ మొదలు పెట్టిన రంగమ్మత్త
By: Tupaki Desk | 11 July 2022 9:13 AM GMTటాలీవుడ్ లో తనదైన మార్కు సినిమాలతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ. దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత కృష్ణవంశీ చేస్తున్న లేటెస్ట్ మూవీ `రంగమార్తాండ`. ప్రకాస్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మరాఠీ సూపర్ హిట్ ఫిల్మ్ `నట సామ్రాట్` ఆధారంగా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. విలక్షణ నటుడు నానా పటేకర్ నటించిన పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజ శ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లపై కాలిపు మధు, ఎస్. వెంకటరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇతర పాత్రల్లో అనసూయ, శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్, అలీ రెజా, ప్రభాకర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. `మన అమ్మా నాన్నల కథ` అనే ట్యాగ్ లైన్ తో ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. కృష్ణవంశీ తన మార్కు భావోద్వేగాల్ని జోడించి ఈ మూవీని తెరకెక్కించారట. నాలుగేళ్ల విరామం తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు కృష్ణవంశీ.
ఇటీవలే ఈ మూవీ టైటిల్ లోగో ని విడుదల చేసిన కృష్ణ వంశీ వన్ బై వన్ ఆర్టిస్ట్ లకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేయించే పనిలో పడ్డారు. ఇప్పటికే కీలక పాత్రలకు సంబంధించిన డబ్బింగ్ ని పూర్తి చేశారట. తాజాగా రంగమ్మత్త అనసూయ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ని మొదలు పెట్టింది. ఇందులో అనసూయ కూడా కీలక పాత్రలో కనిపించబోతోంది. తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యత వుంటుందని తెలుస్తోంది.
ఈ మధ్య క్యారెక్టర్ నచ్చితే గానీ సినిమాలు చేయడం లేదు అనసూయ. సెలెక్టీవ్ గా క్యారెక్టర్ నచ్చితే మాత్రమే సినిమా అంగీకరిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో కృష్ణ వంశీ `రంగ మార్తాండ`లోనూ అనసూయకు మంచి క్యారెక్టర్ దక్కినట్టుగా చెబుతున్నారు. ఓ రంగస్థల కళాకారుడి జీవితం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి మ్యూజిక్ లెజెండ్ ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, కాసర్ల శ్యామ్ సాహిత్యం అందించారు. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందించిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుక రాబోతోంది.