Begin typing your search above and press return to search.
బుద్ధుడి ముందు ఐటెం సాంగ్.. వాటే రిప్లై
By: Tupaki Desk | 10 Feb 2017 5:14 AM GMTరీసెంట్ గా సాయిధరం తేజ్ మూవీ విన్నర్ లోని కొన్ని లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తమన్ మ్యూజిక్ కి మంచి రియాక్షన్ వస్తోంది. అయితే వీటిలో అనసూయ నటించిన ఐటెం సాంగ్ కూడా ఉంది. 'సూయా సూయా' అంటూ సాగే ఈ పాట సూపర్బ్ గా ఉన్నా.. కొందరు నెటిజన్లు విమర్శలు మొదలుపెట్టారు.
బుద్ధుడి విగ్రహం ముందు అర్ధనగ్నంగా డ్యాన్సులు వేయడం ఏంటనేది వీరి ప్రశ్న. ఈ పాయింట్ ను పట్టుకుని అనసూయను ఏకి పడేస్తున్నారు. వీళ్లందరికీ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది హాట్ బ్యూటీ అనసూయ. 'ఈ స్పెషల్ సాంగ్ ను ఉక్రెయిన్ బుద్ధ బార్ అనే పేరు గల ఓ పబ్ లో చిత్రీకరించాం. అక్కడ అప్పటికే బుద్ధుడి విగ్రహం ఉంటుంది. మేమేదీ ఆ విగ్రహం ఏర్పాటు చేయలేదు. గూగుల్ కి వెళ్లి బుద్ధ బార్స్ గురించి ఎంక్వైరీ చేసుకుంటే.. ఈ బుద్ధ బార్స్ చెయిన్ గ్రూప్ గురించి తెలుస్తుంది' అంటూ క్లారిఫై చేసిన అనసూయ.. ఆ తర్వాత డోస్ పెంచేసింది.
'అక్కడి జనాలకు బుద్ధుడి విగ్రహం ముందు పార్టీలు చేసుకుని డ్యాన్సులు చేసుకోవడానికి ఇబ్బంది లేనపుడు.. పాట తీస్తే తప్పేంటట? మా ఉద్దేశ్యం జనాలను ఎంటర్టెయిన్ చేయడమే' అన్న అనసూయ.. 'ఇతరులను ముఖ్యంగా ఆర్టిస్టులను గౌరవించడం చేతకాని జనాలకు.. దేవుడి గురించి మాట్లాడే అర్హత లేదు' అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/