Begin typing your search above and press return to search.
ఇమిటేషన్ లో కేక అంటున్న అనసూయ
By: Tupaki Desk | 17 Feb 2016 10:30 PM GMTటీవీ యాంకర్ నుంచి సినిమా యాక్టర్ గా ప్రమోషన్ సంపాదించింది అనసూయ. ఒకటి అరా సినిమాల్లో వెలిగిపోయి, తర్వాత కనుమరుగయ్యే కేరక్టర్లు కాకుండా.. చాలా జాగ్రత్తగా సినీ కెరీర్ ని ప్లాన్ చేసుకుంటోందని చెప్పాలి. ప్రస్తుతం ఈమె పోలీసాఫీసర్ గా నటించిన క్షణం మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. అసలు క్షణం మూవీలో పాత్ర కోసం ఏడాదిన్నర క్రితం అడివి శేష్ ఓసారి సంప్రదించినపుడు.. తను ఓ ఈవెంట్ కోసం బిజీగా ఉందట. అయినా సరే మరోసారి అప్రోచ్ అయిన శేష్.. పూర్తి స్క్రిప్ట్ చదివి వినిపించాడని చెప్పింది ఈ హాట్ యాంకర్.
పోలీస్ పాత్ర చేయాలని చెప్పగానే షాక్ తినిందట కూడా. అయితే.. ఈ రోల్ కోసం సిద్ధమయ్యేందుకు చాలానే కసరత్తు చేశానని అనింది. కొన్ని పోలీస్ సినిమాలు చూడ్డం ద్వారా ఆయా పాత్రల మేనరిజమ్స్ అర్ధం చేసుకునేందుకు ట్రై చేసిందట. అలాగని ఎక్కువగా పోలీస్ సినిమా చూసే పని పెట్టుకోలేదని కూడా చెప్పింది. 'నేను ఇమిటేషన్ లో సూపర్ అని నాకు తెలుసు. ఎక్కువగా ఆ రోల్స్ చూస్తే.. ఆ పాత్రల ప్రభావం నాపై ఉంటుంది. అందుకే చూడలేదు' అని చెప్పింది అనసూయ. అంతే కాదు.. ఈ మూవీతో తొలిసారిగా అతి తక్కువ మేకప్ తో కెమేరా ముందు యాక్ట్ చేసిందట కూడా.
అసలు మేకప్ లేకుండా కెమేరా ముందుకు రావాల్సి వచ్చిన సందర్భం కూడా క్షణం సినిమానే అని చెప్పిన ఈ భామ.. ఈ మూవీలో ఒకసారి కూడా ఖాకీ డ్రస్ మాత్రం వేయలేదని తేల్చేసింది. ఈ పోలీస్ గెటప్ లో తనను చూశాక.. అలాంటి కేరక్టర్స్ చేయాలంటూ చాలా ఆఫర్స్ వస్తున్నాయని, ఓ బిగ్ ప్రొడక్షన్ హౌజ్ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చానని చెప్పింది అనసూయ.