Begin typing your search above and press return to search.

బీచ్ లో అనసూయ ఆనందాలు

By:  Tupaki Desk   |   27 April 2018 5:43 PM GMT
బీచ్ లో అనసూయ ఆనందాలు
X
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ల వ్యక్తిగత ఫొటోలు ఈ రోజులో ఏ స్థాయిలో వైరల్ అవుతున్నాయో తెలియదు గాని కొంత మంది యాంకర్ల ఫోటోలైతే తెలియకుండానే ట్రెండ్ అవుతున్నాయి. బుల్లి తెరపై రోజు కనిపించే మొహం కాబోలు యాంకర్ అనగనే అందరూ ఆకర్షితులవుతారు. గత కొంత కాలంగా మన టాలీవుడ్ లో అన్ని వర్గాల కుర్ర కారును ఆకర్షిస్తోన్న యాంకర్ అనసూయా.

అమ్మడికి పెళ్లైనా సరే తన క్రేజ్ ను ఏ మాత్రం తగ్గించుకోలేదు. ఒక సెలబ్రెటీగా తన జీవితాన్ని ఎంత హుందాగా ఉంచుకుంటుందో అలాగే వ్యక్తిగత జీవితాన్ని అదే స్థాయిలో సంతోషంగా ఉంచుకుంటుంది. రీసెంట్ గా తన కుటుంబ సభ్యులతో గడిపిన ఆనంద క్షణాలను అమ్మడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. సముద్రపు ఒడ్డున బీచ్ లో అందమైన సన్ సెట్ లో దిగిన ఫొటోలు నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.

ముఖ్యంగా ఆమె భర్తతో దిగిన ఒక ఫొటో అయితే ఎంతో రొమాంటిక్ గా ఉందని నెటిజన్స్ ఎక్కువగా కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ఆమె సహా యాంకర్ రష్మీ గౌతమి కూడా అనసూయ పిక్స్ పై పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యింది. రష్మీ పుట్టిన రోజు కావడంతో అనసూయ స్పెషల్ గా ఆమెకు విషెస్ అందించింది. దీంతో రష్మీ కూడా అనసూయ సింగిల్ ఫొటో తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది.