Begin typing your search above and press return to search.

డైరెక్టర్‌ తో రొమాన్స్‌ పై అనసూయ స్పందన

By:  Tupaki Desk   |   30 Jan 2019 7:38 PM IST
డైరెక్టర్‌ తో రొమాన్స్‌ పై అనసూయ స్పందన
X
పెళ్లి చూపులు చిత్రంతో విజయ్‌ దేవరకొండ ను హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన తరుణ్‌ భాస్కర్‌ త్వరలో హీరోగా ఒక చిత్రంలో నటించబోతున్నాడు. ఆ చిత్రాన్ని విజయ్‌ దేవరకొండ నిర్మించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం. ఇప్పటికే విజయ్‌ దేవరకొండ నిర్మాణంలో తరుణ్‌ భాస్కర్‌ మూవీకి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న ఈ చిత్రంలో అనసూయ నటించబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఒక రొమాంటిక్‌ పాత్రలో అనసూయ కనిపించనుందని, ఇప్పటి వరకు కనిపించినదానికి డబుల్‌ గ్లామర్‌ గా అనసూయ కనిపించబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది.

తరుణ్‌ భాస్కర్‌ మూవీలో తాను నటించబోతున్నట్లుగా వస్తున్న వార్తలపై అనసూయ క్లారిటీ ఇచ్చింది. తాను తరుణ్‌ భాస్కర్‌ హీరోగా నటించబోతున్న సినిమాలో నటిస్తున్న విషయం నిజమే, కాని రొమాంటిక్‌ పాత్ర కాదని, ఆ పాత్ర తన కెరీర్‌ ను మరింతగా ముందుకు తీసుకు వెళ్లేలా ఉంటుందని అనసూయ చెప్పుకొచ్చింది. ఆ పాత్ర గురించి, సినిమా గురించి ప్రస్తుతం అంతకు మించి మాట్లాడనని, త్వరలోనే సినిమా ప్రారంభం అవ్వనుందని, అప్పుడు నా పాత్ర గురించి క్లారిటీ ఇస్తానంటూ చెప్పుకొచ్చింది.

మరోవైపు అనసూయ ముఖ్య పాత్రలో నటించిన 'కథనం' చిత్రం విడుదలకు సిద్దం అవుతోంది. ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పాత్రలో అనసూయ కనిపించబోతుంది. 'క్షణం' చిత్రం తర్వాత అనసూయకు ఈచిత్రం మరింత గుర్తింపును తీసుకు వస్తుందని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు. అనసూయ కూడా ఈ చిత్రంపై చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది. కథనంలో తాను పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తున్నట్లుగా వస్తున్న వార్తలను అనసూయ కొట్టి పారేసింది. సహాయ దర్శకురాలిగా కనిపిస్తానని పేర్కొంది.