Begin typing your search above and press return to search.

అనసూయ..అదిరిపోయే చీర పోజు

By:  Tupaki Desk   |   17 April 2020 7:30 PM IST
అనసూయ..అదిరిపోయే చీర పోజు
X
టాలీవుడ్ గురించిమాట్లాడుకుంటే 'బాహుబలి' కి ముందు-తర్వాత అని చెప్పుకోవాలి. అలాగే బుల్లితెర గురించి మాట్లాడుకుంటే మాత్రం అనసూయకు ముందు అనసూయకు తర్వాత అనిచెప్పుకోవాల్సిందే. యాంకర్లు క్యూట్ గా మాత్రమే ఉంటారు అనే అభిప్రాయాన్ని మార్చేసి హాటుగా ఉంటారని కూడా నిరూపించింది.

అలా అని గ్లామర్ మాత్రమే ఉంది.. ఇంకేమీ లేదు అనే విమర్శకులకు తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు చేసి తనకు తాను నిరూపించుకుంది. 'రంగస్థలం' లో రంగమ్మత్త పాత్ర అనసూయ క్రేజ్ ను డబల్ చేసిందనే చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెగ్యులర్ గా ఏదో పోస్ట్ తో అభిమానులతో నిత్యం టచ్ లో ఉంటుంది.ఒకవేళ అనసూయ అలా ఫోటోలు కనుక తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చెయ్యకపోతే ఊరుకోరు. గతంలో అనసూయ పోస్ట్ చేసిన ఫోటోలను వెలికితీసి మరీ వైరల్ చేస్తారు. ప్రస్తుతం అందరూ లాక్ డౌన్ లో ఉన్నారు కాబట్టి కావలసినంత తీరిక ఓపిక ఉంది కదా!

పైనున్న ఫోటో విషయమేతీసుకుంటే ఆరెంజ్ కలర్ బ్లౌజ్.. లైట్ బ్లూ- లైట్ ఎల్లో కలర్ ఉండే చీర ధరించి స్టెయిన్ లెస్ స్టీల్ రెయిలింగ్ ధరించి వయ్యారంగా వెనక్కుతిరిగింది. నిజానికి అంతా ముందుకు..ముందుకు సాగిపోవాలనే తపనతో వెనక ఏముంది.. అనేది గమనించడం లేదు. వెనుకకు తిరిగి పరిశీలన చేసుకోండి అన్నట్టుగా ఎంతో వేదాంత పరమైన అర్థం ఈ ఫోటో ద్వారా జనాలకు చెప్తున్నట్టుగా ఉంది. ఇంతకీ వెనక ఏముందో పరిశీలించారాలేదా? లేక కనపడని ముందు గురించి దొరకని మందు(కరోనా) గురించే ఇంకా ఆలోచిస్తున్నారా?