Begin typing your search above and press return to search.

అనసూయ డ్రెస్సుల అందుకు కాదట

By:  Tupaki Desk   |   31 Aug 2017 5:09 PM GMT
అనసూయ డ్రెస్సుల అందుకు కాదట
X
పదునైన మాటలతో ట్వీట్స్ తను పోస్ట్ చేయడమే కాదు.. ఇతరులు చేసిన పోస్టులలో ఏవైనా నచ్చినా సరే తెగ షేర్ చేసేస్తూ ఉంటుంది అనసూయ. ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న అర్జున్ రెడ్డి మూవీని పొగిడినా.. ఆ టీంని ప్రశంసించినా.. అమ్మను తిట్టడాన్ని తాను సపోర్ట్ చేయనని.. ఆ సినిమా చూసే ధైర్యం కూడా లేదని చెప్పింది అనసూయ. ఇప్పుడు ఏకంగా మగజాతి మొత్తానికి కౌంటర్ అన్నట్లుగా ఉన్న ఓ మెసేజ్ ఇమేజ్ ను పోస్ట్ చేసి.. కరెక్ట్ అంటోంది అనసూయ.

ఇంతకీ ఆ మెసేజ్ లో ఏం ఉందంటే.. "అడవాళ్లు ఎప్పుడూ డ్రెస్సులు తమ కోసమే వేసుకుంటారని మగవాళ్లు అనుకుంటూ ఉంటారు. అయితే.. మేమెప్పుడూ మా వ్యాక్సింగ్ షెడ్యూల్.. పీరియడ్స్.. మూడ్.. ప్రాంతం.. సీజన్.. ఎవరిని కలుస్తున్నామనే పాయింట్.. మ్యాచింగ్ షూస్.. మ్యాచింగ్ బ్యాగ్.. మ్యాచింగ్ లిప్ స్టిక్.. తగిన అండర్ గార్మెంట్స్.. అన్నీ చూసుకుని ధరిస్తాం. కనీసం మీరు లిస్ట్ లో కూడా లేరు. మగాళ్లూ.. జస్ట్ జిల్ " అంటూ ఆ ఫోటోలో రాసి ఉంటుంది. "పాయింట్ సరిగ్గా ఉంది. కానీ సీరియస్ గా ఇదే నిజం" అంటూ దీనికి ఓ కామెంట్ కూడా జత చేసింది అనసూయ.

ఈ అందాల భామ చెప్పిన పాయింట్ కరెక్టే కావచ్చు కానీ.. ఇంతకీ అనసూయ తన అందాలను ఆరబోసే డ్రెస్సులు వేసుకోవడం.. ఫోటో షూట్స్ చేయడం.. ఐటెం సాంగ్స్ లో సొగసులు చూపించడం.. ఇవన్నీ మగాళ్లను ఆకట్టుకోవడానికే కదా. ఆ పాయింట్ ను అనసూయ లాంటి అందాల భరిణ ఎలా మిస్ అయిందనేది అసలు సిసలు పాయింట్. అందాలు చూపించేందుకు అందుకు కాదని అనసూయ అన్నా.. అభిమానులు అంత తేలికగా ఒప్పేసుకుంటారా?