Begin typing your search above and press return to search.

యాంకర్ హబ్బీకి యాక్టింగ్ గాలి మళ్లింది

By:  Tupaki Desk   |   25 Dec 2017 4:19 AM GMT
యాంకర్ హబ్బీకి యాక్టింగ్ గాలి మళ్లింది
X
సినిమా ఇండస్ట్రీ అయస్కాంతం లాంటిది. ఈ గ్లామర్ ప్రపంచంతో కాస్త టచ్ ఏర్పడితే చాలు.. ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఫ్యామిలీలో ఒక్కళ్లు ఇండస్ట్రీలో పాపులరైనా ఈ గాలి ఇంట్లోని మిగతా వారికి కూడా కాస్త సోకుతుంది. ఈ గ్లామర్ ప్రపంచం ధగధగలు చూశాక మనం కూడా తెరపై మెరిస్తే బాగుంటుందని అనిపిస్తుంటుంది.

తెలుగు టీవీ యాంకర్లకు గ్లామర్ తోపాటు స్టార్ లుక్ తెచ్చిన యాంకర్ అనసూయ. తను వివాహితే అయినా గ్లామర్ లో హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోదు. యాంకర్ గా వచ్చిన ఇమేజ్ తోనే క్షణం సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది. అందులో ఆమె నటనకు మంచి ప్రశంసలే దక్కాయి. దీంతోపాటు ఆమెకు సినిమా ఇండస్ట్రీలో మంచి పరిచయాలే ఉన్నాయి. కొత్త సంవత్సరంలో ఆమె భర్త సుశాంక్ భరద్వాజ్ కూడా సినిమాల్లోకి రావాలని ఆశ పడుతున్నాడనేది లేటెస్ట్ న్యూస్. సుశాంక్ హైదరాబాద్ లో సెటిలయిన నార్త్ ఇండియన్. అనసూయ టీవీ రంగంలో పేరు తెచ్చుకోవడం వెనుక అతడి ఎంకరేజ్ మెంట్ ఎంతగానో ఉంది. భార్య పుణ్యమా అని సినిమా రంగంవాళ్లతో పరిచయాలు పెరగడంతో అతడికి కూడా నటనపై ఆసక్తి పెరిగిందని తెలుస్తోంది.

అనసూయ సన్నిహితులేమో ఈ మాటలను కొట్టిపారేస్తున్నారు. ఆమె భర్తకు బ్యాంక్ ఉద్యోగంపై తప్ప యాక్టింగ్ ఇంట్రస్టేమీ లేదంటోంది. కానీ అతడు మాత్రం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసి ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవాలని ఆశ పడుతున్నాడనేది టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. అందుకోసమే యాక్టింగ్ లో కొంత ట్రైనింగ్ కూడా తీసుకున్నాడట. సరైన అవకాశం వస్తే ఇటువైపు ఓ చూపు చూద్దామని ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనిపై ఈ జంట మాత్రం ఇంకా పెదవివిప్పి ఏం చెప్పలేదు.