Begin typing your search above and press return to search.

వైర‌ల్ వీడియో: ఇట‌లీ అందాల న‌డుమ రాజ‌సూయం

By:  Tupaki Desk   |   20 March 2021 8:20 AM GMT
వైర‌ల్ వీడియో: ఇట‌లీ అందాల న‌డుమ రాజ‌సూయం
X
అందానికి అందం ప్ర‌తిభతో టాలీవుడ్ లో వ‌రుస అవ‌కాశాలు అందుకుంటున్నారు అన‌సూయ‌. ఆరంభం బుల్లితెర యాంక‌ర్ గా రాణించి నెమ్మ‌దిగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో బిజీ న‌టిగా మారారు. రంగ‌స్థ‌లం రంగ‌మ్మ‌త్త‌గా యువ‌త‌రంలో ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకునేందుకు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు అన‌సూయ కోసమే ప్ర‌త్యేకించి కొన్ని పాత్ర‌ల్ని సృష్టిస్తున్నారంటే త‌న స్థాయిని అర్థం చేసుకోవ‌చ్చు.ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అర‌డ‌జ‌ను సినిమాల‌తో అన‌సూయ బిజీ. రంగమార్తాండ‌- థ్యాంక్ యూ బ్రదర్ చిత్రాలతో పాటు రవితేజ హీరోగా తెర‌కెక్కుతున్న ఖిలాడీలోనూ అన‌సూయ ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ కోసం అన‌సూయ ఇట‌లీలో ఉన్నారు. అక్క‌డ సుంద‌ర‌మైన లొకేష‌న్ల‌లో ఖిలాడీ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇక ఆన్ లొకేష‌న్ షూట్ గ్యాప్ లో ఇలా అన‌సూయ ఫోటోషూట్ లో పాల్గొన్నారు. ఇన్ స్టా వేదిక‌గా ఈ స్పెష‌ల్ వీడియోని షేర్ చేయ‌గా క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోయింది. ఈ ఫోటోషూట్ నేప‌థ్యంలో స‌ఖి సినిమా నుంచి చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ `స‌ఖియా చెలియా..` (హిందీ వెర్ష‌న్) ప్లే అవుతోంది. అన‌సూయ అలా స్టైలిష్ గా వాక్ చేస్తూ వెళుతుండ‌గా కెమెరా ఆ విజువ‌ల్స్ ని క్యాప్చుర్ చేసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాల్లో దూసుకెళుతోంది.