Begin typing your search above and press return to search.
'బీచ్'లంటే చాలా ఇష్టం.. స్టార్ యాంకర్ ట్వీట్స్
By: Tupaki Desk | 24 April 2020 9:51 AM GMTటాలీవుడ్ లో యాంకర్లుగా కెరీర్ ప్రారంభించి సినిమా అవకాశాలను దక్కించుకొని నటులుగాను రాణిస్తున్న వాళ్లలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒకరు. నటిగా, -యాంకర్ గా - స్పెషల్ సాంగ్స్ లో ఆదిపడుతూ.. లక్షల ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది అనసూయ. అన్నీ విధాలుగా అనసూయ అభిమానులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం అనసూయ ఏం చేసినా వివాదాలకు గురవుతుంది. ఇక చాలాకాలం తర్వాత నెటిజన్లతో ముచ్చటించింది అనసూయ. ఎప్పుడు చూసినా చిర్రుబుర్రులాడే ఈమె ఈసారి చాలా కూల్‌గా స్పందించిందట. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చేస్తూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది. పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి నెటిజన్లకు చెప్పుకొచ్చింది.
ఇక అనసూయ తనకు ఇష్టమైన విషయాలను చెప్తూ.. యాత్రల పరంగా బీచ్ లు, కొండ ప్రాంతాలకు వెళ్లడటం ఇష్టమట. మరి లాక్డౌన్ పూర్తయ్యాక ఫస్ట్ ఏం చేస్తారు? అని అడిగితే.. సెలూన్‌కు వెళ్లటమని చెప్పుకొచ్చింది. ఇంకా తనను బాగా ఏడిపించిన పుస్తకం 'సిడ్నీ షెల్డన్ రాసిన ఇఫ్ టుమారో కంస్' అని ట్వీట్ చేసింది. ఇక తనపై వచ్చే ట్రోల్ల్స్ పై స్పందిస్తూ.. నాకు నేనే ముఖ్యం అంటుందట. ఇంకా తల్లిదండ్రుల మాటలు గుర్తు తెచ్చుకొని.. పెళ్లయ్యాక ఆడవాళ్ళ లైఫ్ అయిపోయినట్లు కాదు. పెళ్లి తర్వాత అయినా కలలు కంటూ సాధించొచ్చు. ఆడవాళ్లు పెళ్ళైతే లైఫ్ పార్టనర్ అవుతారు కానీ బానిసలు కారని స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చింది. ఇక అనసూయ ఇంత శాంతంగా జవాబివ్వడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.