Begin typing your search above and press return to search.
చిరుతో స్టెప్పులేయనున్న రంగమ్మత్త...??
By: Tupaki Desk | 24 March 2020 12:10 PM GMTఅనసూయ...ఈ పేరు తెలియని తెలుగు టీవీ ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. బుల్లితెరపై పలు షో లు చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ అందాల యాంకరమ్మ. బుల్లి తెరపై అందాలు ఆరబోస్తూ, అద్భుతమైన వ్యాఖ్యానం తో అలరిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును - అభిమానులను సంపాదించుకున్న ఈ బ్యూటీ పలు సినిమాల్లోనూ నటించింది. సుకుమార్ - రాంచరణ్ కాంబినేషన్ లో వచ్చిన 'రంగస్థలం' లో రంగమ్మత్తగా అందరిని మెప్పించింది. ఆ సినిమాతో అనసూయ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఒకవైపు బుల్లితెరపై పలు షోలు చేస్తూనే మరోవైపు అప్పుడప్పుడు వెండితెరపై మెరిసింది. 'క్షణం' - ఎఫ్2 - సోగ్గాడే చిన్నినాయనా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకుమాత్రమే చెప్తా' సినిమాలో కీలకపాత్ర పోషించింది.
అయితే ఇప్పుడు అనసూయ ఒక బంపర్ ఆఫర్ దక్కించుకుందంట. అదీ ఏకంగా మెగాస్టార్ తో కలిసి స్టెప్పులేసే ఛాన్స్ దక్కించుకుందని ఇండస్ట్రీ మొత్తం కోడైకూస్తోంది. చిరంజీవి 152వ మూవీగా తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో అనసూయని ఒక ఐటమ్ సాంగ్ కోసం సంప్రదించారట. ఇంతకుముందు విన్నర్ సినిమాలో అల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఆడిపాడిన అనసూయ ఇప్పుడు మామ తో ఛాన్స్ కొట్టేసిందని అందరూ అనుకుంటున్నారు. దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
ఈ ఏడాది కూడా పలు భారీ ప్రాజెక్టుల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అందులో ప్రస్తుతం అనసూయ సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రంలో నటిస్తోంది. పవన్ కల్యాణ్-క్రిష్ తీయబోతున్న సినిమాలోనూ ఈ అమ్మడుకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.