Begin typing your search above and press return to search.

మామని వద్దన్న అనసూయ.. అల్లుడితో...

By:  Tupaki Desk   |   26 Oct 2016 5:41 AM GMT
మామని వద్దన్న అనసూయ.. అల్లుడితో...
X
హాట్ యాంకర్ అనసూయకు విపరీతంగా క్రేజ్ రాగానే.. సినిమాల్లోకి ఎంట్రీపై బోలెడన్ని వార్తలు వచ్చాయి. అయితే.. అనసూయ సినీ రంగ ప్రవేశం ఖాయం కాగానే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది మూవీలో ఛాన్స్ వచ్చింది. ఆ సినిమాలో ఐటెం భామగా కనిపించేందుకు అవకాశం వచ్చినా.. ఈమె మాత్రం తనకు కేరక్టర్ లేకుండా ఐటెం సాంగ్ చేయబోనని తేల్చేసింది.

ఆ తర్వాత పెద్దగా సినిమాలు చేసేయకపోయినా.. క్షణంలాంటి ఒకటి అరా సినిమాలతో మంచి పేరే తెచ్చుకుంది. కానీ ఆశించిన స్థాయిలో మాత్రం సినిమాల్లో దూసుకుపోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడు అనసూయ ఓ ఐటెం సాంగ్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుండగా.. అది కూడా మెగా హీరో మూవీనే కావడం విశేషం. సుప్రీం హీరో సాయి ధరం తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విన్నర్ మూవీలో ఐటెం భామగా కనిపించేందుకు అనసూయ సై అనడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

చిన్న మామ పవన్ సినిమాలో ఇదే ఆఫర్ వచ్చినపుడు వద్దన్న అనసూయ.. అదే ఫీచర్స్ తో పవన్ ని అచ్చు గుద్దినట్టు దింపేసే తేజు చిత్రానికి మాత్రం అదే టైపు రోల్ ని ఎందుకు అంగీకరించిందా అని సినీ జనాలు మాట్లాడేసుకుంటున్నారు. కారణాలు ఏవైనా.. అనసూయ ఐటెం గాళ్ గా టర్న్ అవడం ఖాయం కాగా.. తొలిసారిగా ఈ పాత్రలో ఈ హాటీని చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/