Begin typing your search above and press return to search.

అనసూయా.. అదిరిపోవడం ఖాయమయ్యా

By:  Tupaki Desk   |   12 Nov 2016 11:30 AM GMT
అనసూయా.. అదిరిపోవడం ఖాయమయ్యా
X
బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ.. ఇప్పుడు వెండితెరపై కూడా వెలుగులు విరజిమ్మేస్తున్న సంగతి తెలిసిందే. కేరక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికే ప్రూవ్ చేసేసుకున్న అనసూయ.. త్వరలో ఐటెం సాంగ్ కూడా చేసేయనుంది. మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరం తేజ్ మూవీలో ఐటెం సాంగ్ కు ఒప్పుకోగా.. ఇఫ్పుడా పాట షూటింగ్ ఉక్రెయిన్ లో జరుగుతోంది.

ఈ ఐటెం పాట.. అనసూయ కెరీర్ లో స్పెషల్ గా నిలిచిపోనుంది. ఎందుకంటే ఈ లిరిక్ 'అనసూయా అనసూయా' అనే సాగుతుందట. ఐటెం సాంగ్ చేయమంటూ ఉఊ అనేసే అనసూయ.. తేజు సినిమాలో చేయడానికి అంగీకరించడం కూడా ఇలా తన పేరుపైనే పాట ఉండడంతోనే అని తెలుస్తోంది. కెరీర్ మొత్తంలో ఒకే ఒక్కసారి వచ్చే అవకాశం కావడంతో.. దీన్ని వదులుకునేందుకు ఇష్టపడలేదని అంటున్నారు.

హాట్ లుక్కులు.. స్పైసీ అందాలతో.. ఈ పాటలో ఓ రేంజ్ లో రెచ్చిపోతోందట అనసూయ భరద్వాజ్. క్షణం మూవీతో తనలోని యాక్టింగ్ ట్యాలెంట్ ను చూపించిన అనసూయ.. తేజు విన్నర్ లో రొమాంటిక్ అండ్ సెక్సీ యాంగిల్ ని చూపించేస్తోదట. మరి అనసూయ అందాలను కళ్లతోనే జుర్రేసుకునేందుకు అభిమానులు రెడీ అయిపోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/