Begin typing your search above and press return to search.
ఫోటో షూట్: కొండ మల్లివా.. బొండు మల్లివా
By: Tupaki Desk | 17 Dec 2019 1:30 AM GMTసోషల్ మీడియా యుగం ఇది. తెలుగమ్మాయిలకు మైలేజ్ పెంచేందుకు అక్కరకొచ్చిన ట్రెండ్ అనే చెప్పాలి. ప్రపంచంలో మారుమూలన ఉన్న ట్యాలెంటుకు సైతం కావాల్సినంత ప్రమోషన్ సోషల్ మీడియా తెస్తోంది. ఇక ఇన్ స్టాగ్రమ్ పుణ్యమా అని కొండమల్లి.. బొండుమల్లి.. పల్లెటూరి ఎంకి.. రంగమ్మత్త .. అందగత్తె ఎక్కడ ఉన్నా ఈ మాధ్యమంలోకి వచ్చి ప్రమోషన్ చేసుకుంటూ సినీ ఛాన్సులు కొట్టేస్తుండడం ఆసక్తికరం.
గత కొంతకాలంగా సోషల్ మీడియాల్లో తెలుగమ్మాయిల దుమారం మామూలుగా లేదు. ఇంతకుముందు ఆడపిల్ల గుమ్మం దాటి వెళితే అయ్యో.. అపరాధం అనేవారు. కానీ ఆ వెనకబడిన ఆలోచనలకు ఏనాడో రాంరాం పలికారు. ఇప్పుడు అంతా మోడ్రన్ ట్రెండ్. ఆడది అబల కాదు సబల... పోటీ ప్రపంచంతో పాటుగా దూసుకుపోవాలి అన్న తత్వం కనిపిస్తోంది. ఇక ఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని అనుకరించడంలో ఇంటర్నేషనల్ స్టాండార్డ్స్ ని టచ్ చేస్తున్నారు తెలుగమ్మాయిలు. ఇదిగో లేటెస్టుగా అనసూయ ఫోటోషూట్లు చూస్తుంటే వ్వావ్ అనకుండా ఉండలేరు. రంగమ్మత్తగా తనకు ఉన్న క్రేజును ఏ మాత్రం మిస్ యూజ్ చేయడం లేదు.
నిరంతరం క్రేజీగా ఏదో ఒక కొత్త కాన్సెప్టుతో ఫోటోషూట్ లో పాల్గొంటూ సోషల్ మీడియా జనాల్ని తనవైపు తిప్పేసుకుంటోంది అనసూయ. తాజాగా ముక్కుకు ముక్కెరతో.. అల్ట్రా మోడ్రన్ డిజైనర్ డ్రెస్ లో తళుక్కున మెరిసింది ఈ బ్యూటీ. ఒకరకంగా కొండ మల్లి... బొండుమల్లి.. డిజైనర్ అందమా అని పొగిడేయాలా ? లేక అల్ట్రా మోడ్రన్ రంగమ్మత్తవా అని కీర్తించాలా? ఏమని పొగడాలి? ఎరుపు పచ్చ పసుపు గళ్ల గళ్ల చెక్స్ టాప్.. కాంబినేషన్ బాటమ్.. మెడలో అల్ట్రా పోష్ పెండెంట్ .. ఆ చేతి వేళ్లకు చిలకాకుపచ్చ నెయిల్ పాలిష్.. బాప్ రే! క్రీగంటి చూపుతోనే యూత్ కి గాలం వేసిన తీరు మతి చెడగొడుతోంది. ఇక థై స్లిట్ లుక్ లో అనసూయ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ కిరాక్ అనే చెప్పాలి. ఇప్పటికిప్పుడు అనసూయ బుల్లితెర - వెండితెర అనే తేడా లేకుండా అన్నిచోట్లా నేనున్నా! అంటూ చెలరేగుతోంది. ఇస్పీడ్ లోనే ఫోటోషూట్లు కెరీర్ కి ప్లస్ అవుతున్నాయన్నమాట!