Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కోక మాటు జ‌బ‌ర్ధ‌స్త్ అందం

By:  Tupaki Desk   |   29 April 2021 11:00 PM IST
ఫోటో స్టోరి: కోక మాటు జ‌బ‌ర్ధ‌స్త్ అందం
X
త‌న‌దైన అందం ప్ర‌తిభ‌తో తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లో క్రేజీ అవ‌కాశాలు అందుకుంటున్న యాంక‌ర్ అన‌సూయ ఒక బేబీకి మ‌ద‌ర్ అన్న విష‌యం అభిమానుల‌కు అస్స‌లు స్ఫుర‌ణ‌కే రాదు. దానికి కార‌ణ‌మేంటో ప్ర‌త్యేకించి చెప్పాలా?

ఫ్యాష‌న్స్ ని అనుక‌రించ‌డంలో ట్రెండ్ సెట్ చేయ‌డంలో అన‌సూయ త‌ర్వాతే! అన్నంత‌గా ఇటీవ‌ల వ‌రుస ఫోటోషూట్ల‌తో హీటెక్కిస్తున్నారు. గ్లామ‌ర్ రంగం పోక‌డ‌ను వంద‌శాతం ఔపోష‌ణ ప‌ట్టిన న‌టీమ‌ణిగా తాను చేయాల్సిన‌దంతా చేసుకుని వెళుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టే ల‌క్ష‌ల్లో పారితోషికాలు వెద‌జ‌ల్లుతూ త‌న‌కోసం క్యారెక్ట‌ర్లు సృష్టిస్తూ ఇండ‌స్ట్రీ బిగ్ గేమ్ ఆడుతోంది. రంగ‌స్థ‌లం రంగ‌మ్మ‌త్త‌గా ద‌క్కిన గుర్తింపును కూడా క్యాష్ చేసుకోవ‌డంలో అన‌సూయ మేధోత‌నం ఇటీవ‌ల చ‌ర్చకు వ‌స్తోంది.

ప్ర‌స్తుతం అన‌సూయ వ‌రుస‌గా టాలీవుడ్ కోలీవుడ్ లో క్రేజీ సినిమాల్లో న‌టిస్తున్నారు. అర‌డ‌జ‌ను పైగానే సెట్స్ పై ఉన్నాయి. ఇందులో బ‌న్ని - సుకుమార్ కాంబినేష‌న్ మూవీ పుష్ప త‌న‌కు మ‌రో ల్యాండ్ మార్క్ మూవీ కాబోతోంది. ప‌నిలో ప‌నిగా స్పెష‌ల్ రోల్స్ స్పెష‌ల్ నంబ‌ర్స్ తోనూ అన‌సూయ ట్రీట్ మునుముందు యూత్ కి క‌న్నుల‌పండుగ చేయ‌నుంది.

తాజాగా సోష‌ల్ మీడియాల్లో అన‌సూయ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ వైర‌ల్ గా మారింది. కోక ర‌వికెలో అన‌సూయ ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నారు. ఆ చార‌ల కోక‌కు న‌లుపు- పింక్ రంగుల మిశ్ర‌మం అద్భుతంగా కుదిరింది. ఆ కోక‌లో అన‌సూయ అందం ప‌దింత‌లు అయ్యేలా ఆ డిజైన‌ర్ వైట్ ర‌వికె ప‌ర్ఫెక్ట్ గా యాప్ట్ అయ్యింద‌నడంలో ఎలాంటి సందేహం లేదు.