Begin typing your search above and press return to search.

న‌ల్ల కోకలో ఆ గ‌మ్మత్తే వేరు మ్యాడ‌మ్!

By:  Tupaki Desk   |   11 Feb 2022 3:47 AM GMT
న‌ల్ల కోకలో ఆ గ‌మ్మత్తే వేరు మ్యాడ‌మ్!
X
ఫ్యాష‌న్ ఎంపిక‌లు ఒక్కొక్క‌రివి ఒక్కోలా ఉంటాయి. త‌మ మేని ఛాయ‌ను అనుస‌రించి కొంద‌రు ఎంపిక‌లు చేసుకుంటే .. ఫ్యాష‌న్ డిజైనింగ్ లో చాలా విష‌యాల‌పై లోతైన అవ‌గాహ‌న‌తో ఎంపిక‌లు సాగించేవారు కొంద‌రు. సినీ సెల‌బ్రిటీల‌కు వ్య‌క్తిగ‌తంగా స్టైలిస్టులు ఫ్యాష‌న్ డిజైన‌ర్లు సూచ‌న‌లు స‌ల‌హాలు ఇస్తుంటారు.

యాంక‌ర్ కం న‌టి అన‌సూయ కూడా త‌న వ్య‌క్తిగ‌త స్టైలిష్టుల నుంచి స‌ల‌హాలు సూచ‌న‌లు స్వీక‌రిస్తార‌ని స‌మాచారం. ఇక న‌ల్ల కోక‌లో యాంక‌ర్ అన‌సూయ హాటెస్ట్ అవ‌తార్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళ్లాయి.

అలాంటి డిఫ‌రెంట్ సంద‌ర్భా నుంచి కొన్ని ఫోటోల బంచ్ మెర్జింగ్ తో ఫోటో వైర‌ల్ అవుతోంది. న‌ల్ల చీర‌లో అన‌సూయ ఎంతో అందంగా ఉన్నారు. హాటెస్ట్ ఎలివేష‌న్ బావుంది! అంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక కెరీర్ ప‌రంగా చూస్తే అన‌సూయ పెద్ద తెర బుల్లితెర‌పై ఎంతో బిజీగా ఉన్నారు. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న క్రేజీ భారీ చిత్రాల్లో అన‌సూయ న‌టించారు. ఖిలాడీ - ఆచార్య స‌హా రంగ మార్తాండ వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అన‌సూయ న‌టించారు.

త‌మిళం మ‌ల‌యాళం క‌న్న‌డ‌లోనూ ఆఫ‌ర్లు అందుకుంటున్నారు. పుష్ప 1 లో క‌నిపించిన అన‌సూయ పుష్ప 2లోనూ న‌టించ‌నున్నారు. బుల్లితెర‌పై జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ గానూ అన‌సూయ బిజీగా కెరీర్ ని సాగిస్తున్నారు.