Begin typing your search above and press return to search.

అన‌సూయ హ‌ర్ట్ అయింది.. కానీ అస‌లు సీక్రెట్ లీక్‌

By:  Tupaki Desk   |   19 Feb 2022 9:37 AM GMT
అన‌సూయ హ‌ర్ట్ అయింది.. కానీ అస‌లు సీక్రెట్ లీక్‌
X
జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అన‌సూయ ఆ పాపులారిటీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. `రంగ‌స్థ‌లం`లో రంగ‌మ్మ‌త్త‌గా కీల‌క పాత్ర‌లో న‌టించి న‌టిగా త‌న స‌త్తా ఏంటో నిరూపించింది. ఆ త‌రువాత కూడా న‌ట‌న‌కు, క్యారెక్ట‌ర్ కు ప్రాధాన్య‌త వున్న చిత్రాలలో మాత్ర‌మే న‌టిస్తూ కెరీర్ ప‌రంగా క్రెజీ న‌టిగా పేరు తెచ్చుకుంది. న‌టిగా వెండితెర‌పై ప్ర‌త్యేకత‌ను చాటుకుంటూ వ‌రుస క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటున్న అన‌సూయ సోష‌ల్ మీడియాలోనూ య‌మ యాక్టీవ్ గా వుంటోంది.

ట్విట్ట‌ర్‌, ఇన్ స్టా వేదిక‌గా అభిమానుల‌తో నిత్యం ట‌చ్ లో వుంటున్న అన‌సూయ అదే స్థాయిలో వివాదాల‌పై కూడా ఘాటుగానే స్పందిస్తూ వార్త‌ల్లో నిలుస్తోంది. దాదాపు న‌ల‌భైకి ద‌గ్గ‌ర‌ప‌డుతున్నా వ‌న్నె త‌ర‌గ‌ని అందాల‌తో అభిమానుల్ని, నెటిజ‌న్ ల‌ని ఆక‌ట్టుకుంటూ వార్త‌ల్లో నిలుస్తోంది. త‌న‌ని ట్రోల్ చేస్తున్న వారికి స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తూ నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. బుల్లితెర‌పై మెరుస్తూనే వెండితెర‌పై బిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ రెండు ప‌డ‌వ‌ల ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తోంది.

`పుష్ప‌`లో దాక్షాయ‌ణిగా డీ గ్లామ‌ర్ పాత్ర‌లో న‌టించి ఔరా అనిపించింది. పార్ట్ 2లో అన‌సూయ పాత్ర అంత‌కు మించి వుంటుంద‌ని తెలుస్తోంది. మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా అన‌సూయ‌పాత్ర పార్ట్ 2లో వుంటుంద‌ని, త‌న త‌మ్ముడిని చంపిని పుష్ప పై ప‌గ‌తో ర‌గిలిపోయే యువ‌తిగా అన‌సూయ పాత్ర హైలైట్ గా నిల‌వ‌నుంద‌ని చెబుతున్నారు. త్వ‌ర‌లోనే `పుష్ప 2` షూటింగ్ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఇందు కోసం రెడీ అవుతోంది.

ఇటీవ‌ల గ్లామ‌ర్ డోస్ పెంచి మ‌రీ న‌టించిన `ఖిలాడీ` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో అన‌సూయ ప్ర‌య‌త్నాలు వృధా అయ్యాయి. ఇదిలా వుంటే ఓ లేడీ జ‌ర్న‌లిస్టు చేసిన ప‌నికి అన‌సూయ హ‌ర్ట్ అయింది. అంత‌టితో ఆగ‌క అస‌లు సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేస్తూ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ నెట్టింట సంద‌డిగా మారింది. ఓ మ‌హిళా జ‌ర్న‌లిస్ట్ ఇటీవ‌ల అన‌సూయ ఫొటో షూట్ కు సంబంధించిన ఫొటోల‌ని వ‌ర్ణిస్తూ 40 ప్ల‌స్ వ‌య‌సులోనూ వ‌న్నెత‌ర‌గ‌ని అన‌సూయ అంటూ కామెంట్ చేసింది.

త‌న‌కు 40 ప్ల‌స్ అని క‌న్ఫ‌ర్మ్ చేయ‌డంతో హ‌ర్ట్ అయిన అన‌సూయ త‌న ఏజ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టి షాకిచ్చింది. నేను 40 ప్ల‌స్ కాద‌ని, త‌న‌కు 36 ఏళ్లేన‌ని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టింది. నిజం చెప్ప‌డానికి నేను సిగ్గుప‌డ‌నని, మీ లాంటి జ‌ర్న‌లిస్ట్ లు నిజాయితీగా వుండ‌టానికి ప్ర‌య‌త్నించాల్సిన స‌మయ‌మిద‌ని సెటైర్లు వేస్తూ ఓ ట్వీట్ చేసింది. ప్ర‌స్తుతం అన‌సూయ షేర్ చేసిన ఈ ట్వీట్ నెట్టింట వైర‌ల్ గా మారింది.