Begin typing your search above and press return to search.

దేవుడా కాపాడు అంటూ వేడుకుంది

By:  Tupaki Desk   |   5 Jan 2020 3:34 PM IST
దేవుడా కాపాడు అంటూ వేడుకుంది
X
యాంక‌ర్ కం న‌టి అన‌సూయ స్పీడ్ గురించి తెలిసిందే. బుల్లితెర‌తో క్ష‌ణం తీరిక లేనంత బిజీగా ఉన్న ఈ భామ మ‌రోవైపు వ‌రుస‌గా క్రేజీ సినిమాల్లో అవ‌కాశాలు అందుకుంటోంది. రంగ‌స్థ‌లం త‌ర్వాత త‌దుప‌రి సుకుమార్ - బ‌న్ని చిత్రంలోనూ ఈ అమ్మ‌డికి ఓ ఛాన్స్ ద‌క్కింద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. అదంతా స‌రే కానీ.. 2020 లో అడుగు పెట్టిన సంద‌ర్భంగా అన‌సూయ సెల‌బ్రేష‌న్స్ ఎక్క‌డ‌? అని ప్ర‌శ్నిస్తే .. అందుకు త‌నే స్వ‌యంగా ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేసింది.

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ కోసం అనసూయ అడ‌వుల‌కు వెళ్లింది. అంద‌రిలా బీచ్ వెకేష‌న్స్ అంటూ ఏమాత్రం హ‌డావుడి చేయ‌కుండా కుటుంబ స‌మేతంగా ఓ అడ‌వికి వెళ్ల‌డం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆన్ లొకేష‌న్ నుంచి అన‌సూయ స్వ‌యంగా ఫోటోలు షేర్ చేసింది. అలాగే వాటితో పాటు ఓ వీడియోని షేర్ చేసి దేవుడా మ‌మ్మ‌ల్ని కాపాడు! అంటూ ప్రార్థించింది.

ఇంత‌కీ ఆ వీడియోలో ఏం ఉంది? అస‌లు దేవుడిని అనసూయ ఎందుకు అంత‌గా ప్రాధేయ‌ప‌డింది? అంటే.. ఆ వీడియోలో ప్రకృతి విలయానికి సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియాలో గత కొన్ని రోజులుగా కొనసాగుతోన్న కార్చిచ్చు ప్రకృతి విలయానికి సంబంధించిన వీడియో అది. దాదాపు 1.45కోట్ల ఎకరాల అటవీ ప్రాంతం బూడిదైపోయింది. ఈ మంటల్లో చిక్కుకొని 50కోట్లకు పైగా మూగజీవాలు చనిపోయాయి. ఊహించ‌ని ప‌రిణామానికి ప్ర‌పంచం విస్తుపోయింది. వాతావ‌ర‌ణ ప్ర‌కోపం ఇది అంటూ ప్ర‌చార‌మ‌వుతోంది. దీనిపై చ‌లించిపోయిన అన‌సూయ దేవుడా మమ్మ‌ల్ని కాపాడు! అంటూ ప్రాధేయ‌ప‌డింది. ఇక ఈ మంట‌ల్లో కోట్లాది సంఖ్య‌లో పక్షులు.. జంతువులు మంటల్లో కాలి బూడిదైపోవడంపై పర్యావరణ- జంతు ప్రేమికుల్ని క‌ల‌చివేస్తోంది.

ఇంత‌కుముందు ఇదే త‌రహాలో న్యూ సౌత్‌వేల్స్‌.. క్వీన్స్‌లాండ్ లో కార్చిచ్చు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. ఇలా ప్ర‌తియేటా అడ‌వులు త‌గ‌ల‌బ‌డిపోతుంటే ఓజోన్ పొర‌కు చిల్లు ప‌డి భూమిపై ఆక్సిజ‌న్ కోల్పోతున్నామ‌న్న యాందోళ‌నా వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ భూమిని అట‌వీ సంప‌ద‌ను కాపాడుకుని ప్ర‌కృతి జీవ‌నం చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను తాజా స‌న్నివేశం చెప్ప‌క‌నే చెబుతోంది.