Begin typing your search above and press return to search.
తన షోల్లో బూతులపై అనసూయ స్పందించింది
By: Tupaki Desk | 30 May 2017 10:45 AM GMT‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో చలపతి రావు వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది. చాలామంది ఆయనపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో ప్రస్తుతం టీవీల్లో వస్తున్న కామెడీ షోల్లో బూతుల మాటేంటి అన్న చర్చ కూడా మొదలైంది. కమెడియన్ పృథ్వీ.. అనసూయ హోస్ట్ చేసే ‘జాక్ పాట్’ షో కోసం తయారు చేసిన ఓ ప్రోమో గురించి మాట్లాడాడు. అందులో అనసూయను చూస్తూ.. జబర్దస్త్ శేషు ‘మీకు లేస్తుంది.. మాకు పడుతుంది’ అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు. ఇది పెద్ద బూతు కదా అని అన్నాడు. మిగతా కామెడీ షోల గురించి కూడా పలువురు విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో యాంకర్ అనసూయ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం కామెడీ షోల్లో బూతులపై తనకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని ఆమె చెప్పింది. ఇలా పెడర్థాలు వచ్చేలా ప్రోమోలు వేయవద్దని.. ఇది ప్రేక్షకులను మిస్ లీడ్ చేస్తుందని.. తాను ముందే షో నిర్వాహకులకు చెప్పానని అనసూయ తెలిపింది. శేషు పాల్గొన్న ఎపిసోడ్ గురించి ఆమె చెబుతూ.. షోలో జరిగింది వేరని.. ప్రోమోలో ఇంకో రకంగా చూపించారని ఆమె తెలిపింది. శేషు డబ్బుల గురించి ఆ మాట అన్నాడని.. కానీ ప్రోమో చూస్తే జనాలకు మరో అభిప్రాయం కలిగిందని ఆమె తెలిపింది. తన షోకు హైపర్ ఆది వచ్చినపుడు కూడా ఇలానే పెడార్థాలు వచ్చేలా ప్రోమో కట్ చేశారని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్ మారిపోయిందని.. ఈ విషయంలో తాను కూడా ఇబ్బందిగా ఫీలవుతున్నానని ఆమె చెప్పింది. ఐతే ఇలాంటివి ఆపడం.. మార్చడం తన ఒక్కదాని చేతిలో లేదని అంది. తమ షో స్టాండ్ ఔట్ గా నిలవాలని.. ప్రోగ్రాం డైరెక్టర్లు ఇలాంటి ప్రోమోలు కట్ చేస్తున్నారని.. ఇలా చేస్తే మనం ట్రాక్ తప్పుతున్నట్లే అని తాను హెచ్చరిస్తున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుత పరిణామాలు తనకో గుణపాఠం అని అనసూయ చెప్పింది. గతంలో కొన్ని షోల్లో తాను కూడా సెన్స్ లేకుండా మాట్లాడి ఉండొచ్చని.. అందుకు సారీ చెబుతున్నానని ఆమె అంది. తాను చేసే షోలకు తగ్గట్లుగా దుస్తులు వేసుకుంటుంటానని.. అది అందరికీ నచ్చాలనేమీ లేదని ఆమె చెప్పింది. అభిమానులతో ఫేస్ బుక్ లైవ్ చాట్ సందర్భంగా అనసూయ ఈ వ్యాఖ్యలు చేసింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/