Begin typing your search above and press return to search.

ఏమైనా అనుకోండి, అస్సలు తగ్గనంతే

By:  Tupaki Desk   |   21 Aug 2015 4:15 AM IST
ఏమైనా అనుకోండి, అస్సలు తగ్గనంతే
X
యాంకర్ల యందు అనసూయ వేరయా విశ్వదాభిరామ వినుర ప్రేక్షక మహాశయా!! అని పద్యం పాడాల్సిందే ఆ దివ్యరూపం కంటపడ్డాక. పైగా అనసూయ ఇప్పుడు సినిమా స్టార్‌ అవ్వబోతోంది. సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో కింగ్‌ కి మేనకోడలు పాత్రలో అదరగొట్టేయబోతోందిట. అంతేనా ఈలోగానే ఓ లేడీ ఓరియెంట్‌ సినిమాలో నటించేందుకు సన్నాహాలు చేసుకుంటోందని వార్తలొచ్చాయి. అందుకే రోజు రోజుకి ఈ ఆంటీగారు కాసింత స్లిమ్‌లుక్‌ లోకి మారుపోతున్నారు.

ఇదిగో ఈ లేటెస్టు ఫోటోషూట్‌ చెబితే ఆ సంగతి మీకే అర్థమవుతుంది. అనసూయ చీరలో సరికొత్తగా కనిపిస్తోంది. బులుగు జిలుగు ముఖమల్‌ జాకెట్‌, పసుపుపచ్చ శారీలో అదరగొట్టేసింది. ఆ ఫోజుల్లోనే కైపుంది. నేను ఏమాత్రం తగ్గను. ఏమైనా అనుకోండి అన్నట్టే ఫోజులిచ్చింది. ఇంతకాలం బుల్లితెరపై టీఆర్‌ పీని శాసించిన అనసూయ ఇకనుంచి వెండితెరపైనా సరికొత్త విన్యాసాలు చేస్తుందనే ఫిలింనగర్‌ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఓవైపు అక్క, చెల్లి, మేనకోడలు, ఆంటీ పాత్రల్లో నటిస్తూనే, కథానాయికగా అసభ్యత లేని వాటిని ఎంపిక చేసుకుని కెరీర్‌ ని సాగిస్తుందని అనుకుంటున్నారు. అయితే స్టార్‌ హీరోల సినిమాలో ఐటెమ్‌ నంబర్లకు మాత్రం అనసూయ నోనో అంటోంది. కాబట్టి అది కాస్త డ్రాబ్యాక్‌!