Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ జోలికి వ‌స్తే వ‌స్తే ఊరుకోనంటోంది

By:  Tupaki Desk   |   27 Feb 2016 11:03 PM IST
ఫ్యామిలీ జోలికి వ‌స్తే వ‌స్తే ఊరుకోనంటోంది
X
గ్లామ‌ర్ ఫీల్డ్ అన్నాక ర‌క‌ర‌కాల కామెంట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాట‌న్నింటినీ పట్టించుకుంటే క‌ష్టం. ఐతే ఆ కామెంట్లు శ్రుతి మించి పోతే మాత్రం ఎవ‌రైనా హ‌ర్ట్ అవుతారు. ఆ మ‌ధ్య అన‌సూయ కూడా అలాగే హ‌ర్ట‌యింది. అల్లు అర్జున్‌ను ఏదో కామెంట్ చేసిందంటూ అత‌డి అభిమానులు అన‌సూయ మీద ప‌డిపోయారు. దీంతో హ‌ర్ట‌యిన అన‌సూయ కూడా త‌న హేట‌ర్స్ కి గ‌ట్టిగానే బ‌దులిచ్చింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ కామెంట్ల ప్ర‌స్తావ‌న రాగానే మ‌రోసారి గ‌ట్టిగా రియాక్ట‌యింది అన‌సూయ‌.

‘‘ఇలాంటి వాటిమీద రియాక్ట్ అవ్వాలా వ‌ద్దా అని. అప్పుడ‌ప్పుడు ఆలోచిస్తుంటాను కాక‌పోతే న‌న్ను కామెంట్ చేస్తే ప‌ట్టించుకోను. కానీ నా ఫ్యామిలీ జోలికి వ‌స్తే మాత్రం త‌ట్టుకోలేను రియాక్ట్ అవుతాను. అంతే కానీ కావాల‌ని వార్త‌ల్లో ఉండ‌డం కోసంమాత్రం రియాక్ట్ అవ్వ‌ను’’ అని చెప్పింది అన‌సూయ‌

ఇక సినిమా కెరీర్ గురించి మాట్లాడుతూ.. ‘‘క్ష‌ణంలో నా పాత్ర‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. అన‌సూయ‌లో యాంక‌ర్ మాత్ర‌మే కాదు మంచి న‌టి కూడా ఉంది అని నిరూపిద్దామ‌ని ఈ సినిమా చేశాను. హీరోయిన్ అవ్వాల‌నే టార్గెట్ ఏమీ పెట్టుకోలేదు. ప్రేక్ష‌కులు న‌న్ను హీరోయిన్ గా చూడాల‌నుకుంటే నాకు అలాంటి అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా చేస్తాను. కేవ‌లం ఐటెం సాంగ్ చేయ‌డంపై నిర్ణ‌యం తీసుకోలేదు. క్ష‌ణం సినిమా చేశాక నా న‌ట‌న‌పై న‌మ్మ‌కం పెరిగింది. కాబ‌ట్టి ఇప్పుడిప్పుడే ఐటం సాంగ్ కి రెడీగా లేను’’ అని అన‌సూయ చెప్పింది.