Begin typing your search above and press return to search.
అంధాధున్ రీమేక్ టబు పాత్రలో ఎవరబ్బా?
By: Tupaki Desk | 26 Feb 2020 12:32 PM GMTయంగ్ హీరో నితిన్ 'భీష్మ' తో ఒక హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక నితిన్ ఫ్యూచర్ ప్రాజెక్టుల లైనప్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. 'రంగ్ దే'.. 'చెక్' సినిమాలు కాకుండా బాలీవుడ్ హిట్ చిత్రం 'అంధాధున్' రీమేక్ లో నటించబోతున్నానని 'భీష్మ' ప్రమోషన్స్ సందర్భంగా ప్రకటించాడు. ఈ సినిమాకు ఎక్స్ ప్రెస్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తాడు.
అయితే ఈ సినిమా హిందీ వెర్షన్ లో రాధిక ఆప్టే.. టబు ఇతర కీలక పాత్రలు పోషించారు. వారి పాత్రలకు తెలుగులో ఎవరిని ఎంచుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా టబు పాత్ర చాలా కీలకమైనది. ఈ పాత్రకోసం తెలుగులో అనసూయ.. రమ్యకృష్ణలను ఇప్పటికే సంప్రదించారని సమాచారం. అందుబాటును బట్టి ఇద్దరిలో ఒకరిని ఫైనలైజ్ చేస్తారని అంటున్నారు. రమ్యకృష్ణ ఎలాంటి పాత్రనైన అవలీలగా చెయ్యగలరు. అనసూయ కూడా రంగామ్మత్త పాత్రతో తన సత్తా చాటారు కాబట్టి ఈ క్యారెక్టర్ కష్టమేమీ కాకపోవచ్చు. మరి ఇద్దరిలో ఎవరు ఫైనల్ గా ఆ పాత్రను యాక్సెప్ట్ చేస్తారో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే మేర్లపాక గాంధి మొదట్లో ఎక్స్ ప్రెస్ సినిమాలతో విజయాలు తన ఖాతాలో వేసుకున్నాడు కానీ తన లాస్ట్ సినిమా 'కృష్ణార్జున యుద్ధం' ఆశించిన ఫలితం సాధించలేదు. ఇప్పుడు రీమేక్ సినిమాను ఎంచుకున్నాడు. మేర్లపాక గాంధి కెరీర్ లో ఇది మొదటి రీమేక్ చిత్రం. మరి ఈ సినిమాను మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మలిచి ప్రేక్షకులను మెప్పించగలడా అనేది వేచి చూడాలి.