Begin typing your search above and press return to search.

‘రంగస్థలం’లో చరణ్=‘స్వయంకృషి’లో చిరు

By:  Tupaki Desk   |   28 Sept 2017 1:24 PM IST
‘రంగస్థలం’లో చరణ్=‘స్వయంకృషి’లో చిరు
X
రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ గురించి ఇటు హీరో కానీ.. అటు దర్శకుడు కానీ.. నిర్మాతలు కానీ ఇప్పటిదాకా ఏ ముచ్చట్లూ చెప్పలేదు. ఐతే ఈ చిత్రంలో ఓ పాత్ర చేస్తున్న అనసూయ మాత్రం తరచుగా ఈ సినిమా గురించి మాట్లాడేస్తోంది. ఇంతకుముందు ‘రంగస్థలం’ సినిమాలో తన పాత్రకు సంబంధించి ప్రి లుక్ ఒకటి రిలీజ్ చేసి.. ఆ సినిమాలోని డైలాగ్ కూడా అనసూయ షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమాలో చరణ్ పోషిస్తున్న పాత్ర గురించి కొన్ని ముచ్చట్లు చెప్పింది అనసూయ. ఆమె ‘రంగస్థలం’లో చరణ్ పెర్ఫామెన్స్ గురించి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

‘రంగస్థలం’లో చరణ్ పాత్ర.. అతడి నటనకు తాను ఫిదా అయిపోయినట్లు అనసూయ చెప్పింది. ఇప్పటిదాకా రామ్ చరణ్ సినిమాలు చూడటమే తప్ప.. నేరుగా కలిసి నటించలేదని.. ఇప్పుడు ‘రంగస్థలం’లో అతడితో కలిసి నటిస్తుండటంతో తనేంటో తెలుస్తోందని చెప్పింది అనసూయ. ఈ సినిమాలో చరణ్ పెర్ఫామెన్స్ చూశాక.. తనకు మెగాస్టార్ చిరంజీవి చేసిన ‘స్వయం కృషి’ గుర్తుకొచ్చిందని అనపూయ చెప్పింది. ఆ సినిమాలో చిరంజీవి తన పాత్రను ఎలా ఓన్ చేసుకున్నారో.. ‘రంగస్థలం’లో తన పాత్రను చరణ్ అలాగే ఓన్ చేసుకున్నాడని.. ఇందులో చరణ్ ను చూసి తాను స్పెల్ బౌండ్ అయిపోయానని చెప్పింది అనసూయ. ఈ మాటలు మెగా అభిమానుల్లో భలే ఉత్సాహం తెస్తున్నాయి.