Begin typing your search above and press return to search.
అనసూయ మరీ ఇంత తేడానా?
By: Tupaki Desk | 4 May 2019 6:19 AM GMTజబర్దస్త్ యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు సంబంధించిన ఫొటోలు మరియు తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూనే ఉంటుంది. తాజాగా ఈమె ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ చిత్రంను చూసిందట. ప్రపంచ వ్యాప్తంగా సంచలన వసూళ్లను నమోదు చేసిన ఈ చిత్రం ఇండియాలో గత రికార్డులను బ్రేక్ చేసింది. 400 కోట్ల దిశగా ఈ చిత్రం దూసుకు పోతుంది. రికార్డు స్థాయి వసూళ్లను దక్కించుకుంటూ ప్రతి ఒక్కరితో ప్రశంసలు పొందుతున్న ఎండ్ గేమ్ తనకు నిరాశ కలిగించిందని అనసూయ ట్వీట్ చేసింది.
ట్విట్టర్ లో అనసూయ... కాస్త ఆలస్యంగా ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ చూశాను, నా పనులు అన్ని పూర్తి చేసుకుని, సినిమాకు సమయం కేటాయించేందుకు ఇప్పుడు వీలు కలిగింది. నేను మొదటి నుండి కూడా ఎవెంజర్స్ కు వీరాభిమానిని, అందుకే ఈ చిత్రంను చూడాలని చాలా ఆశ పడ్డాను. సినిమాలోని కొన్ని సీన్స్ మధురానుభూతులను పంచాయి. ఎవెంజర్స్ ఎండ్ గేమ్ చూసి హ్యాపీ ఫీల్ అయ్యాను. అయితే పూర్తి స్థాయిలో సినిమా నన్ను ఆకట్టుకోలేదు. సినిమా నాకు కాస్త నిరాశను మిగిల్చింది.
ఎవెంజర్స్ : ఎండ్ గేమ్ నిరాశ పర్చినంత మాత్రాన నేను ఎవెంజర్స్ కు ఫ్యాన్ ను కాకుండా పోను. నేను రాబోయే 21 సినిమాలను కూడా చూస్తాను. అయితే ఎండ్ గేమ్ ను మాత్రం మళ్లీ చూడాలని నేను అనుకోవడం లేదు. నాకు ఈ చిత్రం ఎందుకు నిరాశ పర్చిందనే విషయాన్ని నేను తర్వాత చెప్తాను. ఆ విషయాలు చెప్పి అభిమానులను నిరాశ పర్చడం నాకు ఇష్టం లేదు అంది. అనసూయ వ్యాఖ్యలపై రకరకాలుగా కామెంట్స్ వస్తున్నాయి. అందరిది ఒక దారి అయితే అనసూయది మరో దారి, ఆమె తేడా అనుకున్నాం కాని మరీ ఇంత తేడానా అంటూ ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. ఇక మరో వ్యక్తి వార్తల్లో ఉండేందుకు ఎవెంజర్స్ గురించి అనసూయ ఇలా కామెంట్స్ చేసిందని అన్నాడు. మరి కొందరు మాత్రం అనసూయ స్పందనను సమర్ధించారు.
ఇక ఇదే సినిమా గురించి ప్రముఖ రచయిత శోభాడే కూడా విమర్శలు చేసింది. నా జీవితంలో ఇంత చెత్త సినిమా చూడలేదు అంటూ కామెంట్ చేసి అందరిని ఆశ్చర్య పర్చింది. 11 ఏళ్ల కాలంలో మార్వెల్ సీక్వెల్ లో వచ్చిన అతి బోరింగ్ సినిమా ఇదేనంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై కూడా సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. నీ వయసు వారికి ఇది అలాగే అనిపిస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కేవలం ఇండియాలోనే 400 కోట్లు వసూళ్లు చేసి విజయవంతంగా దూసుకు పోతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మరన్ని రికార్డులను కొల్లగొడుతోంది.