Begin typing your search above and press return to search.
రాశీ అత్తకు దక్కాల్సినది!
By: Tupaki Desk | 22 Dec 2019 5:32 AM GMTకొన్నిసార్లు అంతే! ఫేట్ డిసైడ్ చేస్తుంటుంది. తానొకటి తలిస్తే దైవం ఇంకొకటి తలచిన చందంగా సన్నివేశం మారుతూ ఉంటుంది. ముఖ్యంగా సినీపరిశ్రమలో ఇలాంటివి రెగ్యులర్ గా చర్చకు వస్తుంటాయి. ఫలానా బ్లాక్ బస్టర్ మూవీ నేను చేయాల్సినదే.. కానీ కుదరలేదు! అంటూ హీరోలు.. హీరోయిన్లు పోగొట్టుకున్న ఛాన్స్ గురించి గుర్తు చేసుకుని వాపోతుంటారు.
దీనిని ఫేట్ అనే అనాలా లేక ఇంకేదైనానా? నటి రాశీ చేయాల్సిన రంగమ్మత్త పాత్రను అనసూయ భరద్వాజ్ తో రీప్లేస్ చేశారు. రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర తొలి ఛాయిస్ అనసూయ కానేకాదు. వేరొకరిని అనుకున్న తర్వాతనే అనసూయను ఆ అవకాశం వరించింది. అటుపై ఆ సినిమా రిలీజై సంచలన విజయం సాధించడం.. అందులో నటించిన అనసూయ పేరు మార్మోగిపోవడం తెలిసిందే. రంగమ్మత్తగా అనసూయ నటనకు కుర్రకారు స్పెల్ బౌండ్ అయిపోయారు. అంతేనా అవార్డుల కమిటీలు సైతం అనసూయ అభినాయానికి ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఏకంగా ఫిలింఫేర్ సౌతిండియా- ఉత్తమ సహాయనటి అవార్డునే కొల్లగొట్టింది అనసూయ.
శనివారం సాయంత్రం చెన్నయ్ లో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో అనసూయ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు సుకుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. అంతగా బయటి ప్రపంచానికి తెలియని నటి అని అన్నారు కదా.. ఇప్పుడు `అన్ సంగ్` అనలేరు! అంటూ కొంటెగా కామెంట్ ని రువ్వింది అనసూయ. ఇప్పటికైనా అర్థమవుతోందా అలాంటి కామెంట్లు చేయడం సరికాదని!!