Begin typing your search above and press return to search.
మీడియాకు అనసూయ వార్నింగ్..!
By: Tupaki Desk | 22 Dec 2019 11:03 AM GMTసోషల్ మీడియాలో సిని పరిశ్రమకు చెందిన వ్యక్తులకు సంబంధించి చేసే తప్పుడు ప్రచారం అంతా ఇంతా కాదు. చీమ చిటుక్కుమన్నా సరే వాళ్ళ గురించి కథనాలు రాయడానికి సిద్దమవుతున్నారు. సోషల్ మీడియా ఆధారంగా ప్రధాన మీడియా కూడా కాస్త రాంగ్ ట్రాక్ పడుతోంది. దాని కారణంగా కలిగే నష్టాలు ఏంటీ ? వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు... అనేది మాత్రం ఆలోచించడం లేదు. తాజాగా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇంటి మీద ఐటి దాడులు జరిగాయని కొన్ని వార్తలు హల్చల్ చేశాయి.
ఇక ఆ జాబితాలో యాంకర్లు సుమ - అనసూయ కూడా చేరిపోయారు. వాళ్ళ ఇళ్ళ మీద కూడా ఐటి దాడులు జరిగాయని వార్తలు రాశారు. దీనిపై యాంకర్ సుమ స్పందిస్తూ ఇదంతా అబద్ధం అని కొట్టి పడేశారు. ఇక అనసూయ కూడా ఘాటుగా స్పందించింది. మీడియా స్నేహితులారా నా ఇల్లు బంజారా హిల్స్‌లో లేదు... అలాగే నా ఇంటి మీద ఏ ప్రభుత్వ సంస్థకు చెందిన అధికారులు రైడ్ చేయలేదు... మీడియా అధికారిక సమాచారం ఇవ్వాలిగాని... మీ వ్యక్తిగత అభిప్రాయాలు - ఊహలతో ప్రకటనలు చేయకూడదని ఖండించింది.
ఈ రంగంలో కొనసాగుతూ పేరు - గౌరవం సంపాదించుకోవడానికి మేము ఎన్నో త్యాగాలు చేస్తున్నాం... బలమైన రంగంగా ఉన్న మీడియా సమాజానికి మంచి చేస్తూ, మంచి వైపు నడిపించే దిశగా ప్రయత్నించాలి. అంతేగాని ఎంతో కష్టపడి మంచి స్థాయికి చేరుకున్న వ్యక్తుల జీవితాలను గాయపరచకూడదు. నేను మీడియాను గౌరవిస్తా. మీరు ఓ వార్తను రాసేప్పుడు నిజానిజాలు సరిచూసుకోండి... అంటూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇటీవల టాలీవుడ్ లో ఐటీ దాడులు అనేవి సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నిర్మాతలను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు జరుగుతున్నాయి. పనిలో పనిగా కొందరు హీరోయిన్ల పేర్లు కూడా లాగేశారు.